Premi Vishwanath Nirupam Paritala : డాక్టర్ బాబు రియల్ భార్య ఇంటికి సీరియల్ భార్య.. వీడియోలో వంటలక్క రచ్చ రచ్చ!

డాక్టర్ బాబు, వంటలక్క అనే పేర్లు అనగానే మనకు గుర్తొచ్చే సీరియల్ కార్తీకదీపం.ఈ సీరియల్ తెలుగు రాష్ట్రాలలో ఎంత ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Dr Babus Real Wife Is A Serial Wife At Home, Doctor Babu , Nirupam Paritala, Pre-TeluguStop.com

గత ఆరు సంవత్సరాల నుండి ప్రసారమవుతున్న ఈ సీరియల్ కు విపరితమైన ఫాలోయింగ్ ఉంది.ముఖ్యంగా ఇందులో నటించే వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలకు మాత్రం మంచి గుర్తింపు ఉంది.

చాలావరకు ఈ సీరియల్ ను వీరి కోసమే చూస్తుంటారు ప్రేక్షకులు.ఒక గత ఆరు సంవత్సరాల నుండి ఈ సీరియల్ ఒక్కటే కథతో కొనసాగుతుంది.ఇదంతా పక్కన పెడితే వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలో నటించే ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ప్రేమి విశ్వనాథ్ మలయాళం ఇండస్ట్రీకి చెందిన నటి.

ఇక కార్తీకదీపం సీరియల్ తో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.నిరుపమ్ పరిటాల మాత్రం అప్పటికే పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక కార్తీకదీపం సీరియల్ తో మాత్రం చెప్పలేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు.అయితే వీళ్లు సీరియల్లో భార్య భర్తలుగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా భార్య భర్తలుగా కలిసి జీవించలేదు సీరియల్లో.

ఎప్పుడు ఏదో ఒకటి ట్విస్ట్ తో ఇద్దరు విడిపోతూనే ఉన్నారు.ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది కథ.కానీ ప్రేక్షకులకు మాత్రం ఈ సీరియల్ బోర్ కొట్టడం లేదు.ఇక ఈ నటీనటులు సెట్ లో సేపు చాలా సరదాగా ఉంటారు.

ఇద్దరు కలిసి రీల్స్ చేస్తుంటారు.వాటిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు.

పైగా వీరి మధ్య మంచి స్నేహబంధం ఉంది.

ఇక వీరికి యూట్యూబ్ లలో ఛానల్స్ కూడా ఉన్నాయి.ఇప్పటికీ వీళ్ళు చాలా వీడియోలు పంచుకున్నారు.తాజాగా వంటలక్క తన డాక్టర్ బాబు ఇంటికి వెళ్ళింది.

ఇక దానికి సంబంధించిన వీడియోను యూట్యూబ్ లో పంచుకుంది.అందులో తను ఎప్పటిలాగే ట్రెడిషనల్ గా రెడీ కాగా డాక్టర్ బాబు ఇంటికి వ్లాగ్ చేసుకుంటూ వెళ్ళింది.

డాక్టర్ బాబు ఇంటికి వెళ్లే గానే మొదట డాక్టర్ బాబు గత మర్చిపోయినట్లుగా సీరియల్ సీన్లోకి వెళ్ళాడు.వంటలక్క కూడా అలాగే చేసింది.తర్వాత నిరూపమ్ తన భార్య మంజులను ప్రేమీ విశ్వనాథ్ కు పరిచయం చేశాడు.ఇక వారితో ప్రేమి విశ్వనాథ్ కాసేపు సరదాగా ముచ్చట్లు పెట్టింది.

అంతేకాకుండా వాళ్ళ కోసం స్పెషల్ గా గిఫ్ట్ కూడా ఇచ్చింది.

నిరుపమ్ దంపతులు కూడా ప్రేమి విశ్వనాద్ కి చీర సారే పెట్టారు.ఇక మొత్తానికి ఈ వీడియోలో వంటలక్క బాగా రచ్చ రచ్చ చేసిందని చెప్పవచ్చు.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.

ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ తెగ ఎంజాయ్ చేసినట్లు కనిపించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube