వైఎస్ఆర్ కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు.ఇవాళ, రేపు జిల్లాలో పర్యటించనున్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
పర్యటనలో భాగంగా పార్నపల్లి సీబీఆర్ రిజర్వాయర్ వద్ద బోటింగ్ ను జగన్ ప్రారంభించనున్నారు.మధ్యాహ్నం వైఎస్ఆర్ లేక్ వ్యూ పాయింట్ వద్ద రెస్టారెంట్ ను ప్రారంభించనున్నారు.
అనంతరం ప్రజా సమస్యలపై ప్రజల నుంచి వినతిపత్రాలను సీఎం జగన్ స్వీకరించనున్నారు.రాత్రి పులివెందులలో బస చేయనున్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.