మీ ఫోన్‌ మిస్ అయిందని బాధపడకండి... వెంటనే ఇవి బ్లాక్‌ చేయండి సరిపోతుంది!

డిజిటల్‌ యుగం నడుస్తోంది.మోడీ ఏ ముహూర్తాన ‘డిజిటల్ ఇండియా’ అని మొదలు పెట్టాడో గాని, ఇండియా మెల్లమెల్లగా డిజిటల్ యుగంలోకి వెళ్ళిపోతోంది.

 Dont Worry About Missing Your Phone Just Block Upi Apps Immediately Details, Pho-TeluguStop.com

ముఖ్యంగా నేటి యువత జేబుల్లో డబ్బు పెట్టుకుని తిరగడం మానేశారు.ఏ చిన్న షాపింగ్ చేస్తున్నా చేతిలో డివైస్‌తోనే పని కానిచ్చేస్తున్నారు.

ఇక చిన్న పెద్ద వ్యాపారస్తులందరూ డిజిటల్ పేమెంట్ ని అంగీకరిస్తున్నారు.పేమెంట్స్‌ మొత్తం UPI(యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌) విధానంలోనే జరుగుతోంది.

అయితే ఈ విధానంలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అంతే నష్టాలు కూడా వున్నాయి.

సడెన్ గా ఎవరి ఫోన్‌ అయినా పోతే మనీపరంగా నష్టం జరుగుతోంది.

ప్రైవేటు సెట్టింగ్స్‌ను ఎనేబుల్‌ చేసుకోలేనిపక్షంలో చాలా సులువుగా ఇతరులు యాక్సెస్‌ పొందే అవకాశం ఉంటుంది.అందువల్ల డివైస్‌ పోయిందని గుర్తించగానే ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంను ముందుగా బ్లాక్‌ చేసుకోవాలి.

ఇపుడు అదెలాగో తెలుసుకుందాం…

మీరు పేటీఎం యూజర్లు అయితే…

1.ముందుగా పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ హెల్ప్‌లైన్‌ 01204456456 కు కాల్‌ చేయాలి.తరువాత ‘లాస్‌ ఫోన్‌’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.

2.

‘ఎంటర్‌ ఎ డిఫరెంట్‌ నంబర్‌’ని సెలెక్ట్‌ చేసుకుని పోగొట్టుకున్న ఫోన్‌ నంబర్‌ను టైప్‌ చేయాలి.ఆ తరువాత లాగౌట్‌ ఆఫ్‌ ఎవ్విర్‌ డివైస్‌ సెలెక్ట్‌ చేసుకోవాలి.

3.ఇపుడు పేటీఎం వెబ్‌సైట్‌లోకి వెళ్ళి 24 ఇంటూ 7 హెల్ప్‌ని సెలెక్ట్‌ చేసుకోవాలి.

‘రిపోర్ట్‌ ఎ ఫ్రాడ్‌’ని ఎంపిక చేసుకుని ఎనీ కేటగిరీని సెలెక్ట్‌ చేసుకోవాలి.ఒక ఇష్యూని సెలెక్ట్‌ చేసుకున్న తదుపరి పేజీ అడుగున ఉన్న ‘మెసేజ్‌ అజ్‌’ బటన్‌ని క్లిక్‌ చేయాలి.

4.ఇపుడు అకౌంట్‌ ఓనర్‌షిప్‌నకు సంబంధించి ప్రూఫ్‌ని అందించాలి.

డెబిట్‌/క్రెడిట్‌ కార్డ్‌ స్టేట్‌మెంట్‌ – అందులో పేటీఎం అకౌంట్‌ లావాదేవీలు ఉండాలి, కన్ఫర్మేషన్‌ ఈమెయిల్‌ లేదా పేటీఎం లావాదేవీలకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌, ఫోన్‌ నంబర్‌కు సంబంధించిన ఓనర్‌షిప్‌ డాక్యుమెంటేషన్‌, లేదా ఫోను పోగొట్టుకున్నట్టు పోలీసుకు ఇచ్చిన రిపోర్టు డాక్యుమెంటేషన్‌ ప్రూఫ్‌గా ఇవ్వాలి.

Telugu Block Apps, Google Pay, Phone, Paytm, Phone Pe, Upi Apps, Upi-Latest News

మీరు గూగుల్‌ పే యూజర్లు అయితే…

1.ముందుగా కస్టమర్‌ సర్వీస్‌ 18004190157 నంబర్‌కు డయల్‌ చేసి కనెక్ట్‌ కావచ్చు.

2.అకౌంట్‌ను బ్లాక్‌ చేయడంలో అందుబాటులోకి వచ్చిన ప్రతినిధి సహాయపడతారు.ఒకవేళ ప్రత్యామ్నాయం కావాలని అనుకుంటే, ఆండ్రాయిడ్‌ డివైస్‌ను ఉపయోగిస్తున్నపక్షంలో డేటాను పూర్తిగా తుడిచిపెట్టాలి.తద్వారా గూగుల్‌ పే యాప్‌ యాక్సెస్‌ అలా గూగుల్‌ అకౌంట్‌ పొందకుండా చూసుకోవచ్చు.ఐఓఎస్‌ యూజర్లు సైతం ఇదే పని చేయవచ్చు.

మీరు ఫోన్‌ పే యూజర్లు అయితే…

Telugu Block Apps, Google Pay, Phone, Paytm, Phone Pe, Upi Apps, Upi-Latest News

1.ముందుగా 08068727374 లేదా 02268727374కి డయల్‌ చేయాలి.

2.ప్రాబ్లమ్‌ను తెలియజేయమంటూ నెంబర్‌ ఇచ్చినప్పుడు దాన్ని ప్రెస్‌ చేయాలి.కన్ఫర్మేషన్‌ కోసం ఓటీపీ వస్తుంది.

3.‘ఐ హేవ్‌ నాట్‌ రిసీవ్డ్‌ యాన్‌ ఓటీపీ’ని ఎంట్రీ కోసం ఎంపిక చేసుకోవాలి.తరువాత ఎస్‌ఐఎం లేదంటే డివైస్‌ పోగొట్టుకున్నట్టు తెలిపే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.

4.సంస్థ ప్రతినిధిని మీ ఫోన్‌ నంబర్‌, ఈమెయిల్‌ అడ్రస్‌, ఆఖరు పేమెంట్‌ వ్యవహారం, దాని వాల్యూ తదితరాలు పొందగానే ఫోన్‌పే అకౌంట్‌ బ్లాక్‌ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube