ఏప్పుడూ విమర్శలేనా ఘనతలు కూడా చూడండి: బొత్స

ప్రతిపక్ష మీడియాలో ఏప్పుడూ ప్రభుత్వం పై విమర్శలే కాదని వాస్తవ పరిస్థితులు నిష్పక్షపాతంగా రిపోర్ట్ చేసేదే అసలైన జర్నలిజం అంటూ చెప్పుకొచ్చారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ).గత కొన్ని రోజులుగా జీతల ఆలస్యం అంటూ వరుస కధనాలు ప్రసారం అవుతున్నాయని , ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యమైన మాట వాస్తవమేనని అయితే ఇందులో టెక్నికల్ కారణాలే తప్ప మరే ఇతర కారణాలు లేవని ఈనెల 7 ,8 వ తారీకు వరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు పడతాయని ఆయన చెప్పుకొచ్చారు.

 Dont Ever Criticism See Also Credits: Botsa Satyanarayana , Ycp, Tdp , Ap Polit-TeluguStop.com

ప్రభుత్వం పై ఎప్పుడూ విమర్శలు చేయడమే లక్ష్యంగా ఉండకూడదు అని ప్రభుత్వ ఘనతలు కూడా చూడాలని ఆయన చెప్పుకోచ్చారు .తమ ప్రభుత్వం త్వరలోనే మూడు వేల రెండు వందలకు పైగా ఖాళీలను విద్యాశాఖలో పూరించబోతుందని, ఒక నెలరోజుల వ్యవది లోపలే నియామకాలు చేపడతామని ఆయన చెప్పుకొచ్చారు .

Telugu Ap, Educational, Niti Aayog, Ys Jagan-Telugu Political News

అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో విద్యా రంగంలో మౌలిక వసతులు దగ్గరనుంచి విద్యా నాణ్యతా ప్రమాణాలు వరకు ముందంజ లో ఉన్నామని నీతి అయోగ్( NITI Aayog ) ప్రశంసించిందని, ఏపీని ఆదర్శంగా తీసుకోమని మిగతా రాష్ట్రాలకు సూచించిందని దేశంలో ఎప్పుడైనా ప్రభుత్వ కళాశాలలకు ముందు సీట్లు లేవు అన్న బోర్డును చూశారా? అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖలో పెంచిన ప్రమాణాల వల్ల ఇది సాధ్యపడిందని ప్రైవేటు విద్యాసంస్థలతో పోటీపడే స్థాయిలో ప్రభుత్వ విద్యాసంస్థలను( Government educational institutions ) నిలబెట్టిన ఘనత జగన్ ప్రభుత్వానీదే అంటూ ఆయన చెప్పుకొచ్చారు

Telugu Ap, Educational, Niti Aayog, Ys Jagan-Telugu Political News

అంతేకాకుండా 60 వేల డిజిటల్ క్లాస్ రూమ్ను కూడా ఏర్పాటు చేసి దేశంలోనే సరికొత్త మార్పులను విద్యా విధానంలో ప్రవేశపెడుతున్నామని, పదివేల కోట్లకు పైగా నిధులను ముఖ్యమంత్రి జగన్( CM ys jagan ) విద్యారంగంలో కేటాయించారని మరే ఇతర రాష్ట్రం కూడా ఇంత భారీ స్థాయిలో విద్యారంగానికి కేటాయింపులు చేయలేదని ఇది తమ ప్రభుత్వ ఘనత అంటూ ఆయన చెప్పుకొచ్చారు.అయితే బోధన యేతర పనులతో ఉద్యోగులు చదువు చెప్పడంపై దృష్టి పెట్టలేకపోతున్నారన్న ప్రతిపక్షాల విమర్శలపై మాత్రం ఆయన వ్యాఖ్యానించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube