కొందరు తమ వ్యక్తిగత విషయాలను పక్కకు పెట్టి మరీ ఇతరుల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి బాగా ప్రయత్నిస్తూ ఉంటారు.ప్రతి విషయంలో వాళ్ల కదలికలు గమనిస్తూ ఉంటారు.
ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.ముఖ్యంగా వారి లైఫ్ స్టైల్ ని కూడా అస్సలు వదలరు.
వాళ్ళ విషయంలో ఏదైనా కాస్త తేడా కనిపిస్తే చాలు వెంటనే ఆ విషయాన్ని పసిగట్టి కావాలని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తూ ఉంటారు.అయితే తాజాగా మంచు లక్ష్మి( Manchu Lakshmi ) పై కూడా టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు.
ఇంతకూ అసలేం జరిగిందో తెలుసుకుందాం.
మంచు లక్ష్మీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు.తన మాటతీరుతో అందరి దృష్టిలో పడిన మంచు లక్ష్మి.ఒకప్పుడు టాలీవుడ్ ( Tollywood )ఇండస్ట్రీలో హీరోయిన్ గా, విలన్ గా ఓ వెలుగు వెలిగిందని చెప్పాలి.
కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకcపోయింది.ఈమె నటించిన సినిమాలలో సక్సెస్ కంటే ఫ్లాప్స్ ఎక్కువగా ఉండేవి.దీంతో ఈమెకు ఎక్కువగా అవకాశాలు రాలేకపోయాయి.
ఇక సినిమాలకు దూరంగా ఉంటూ నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.
ఇక నటిగా ఉన్న సమయంలోనే పలు షో లలో వ్యాఖ్యాతగా చేసింది.కొన్ని రియాలిటీ షోలు కూడా నడిపించింది.
ఆ తర్వాత పెళ్లి చేసుకొని సరోగసి ద్వారా ఒక పాపకు జన్మనిచ్చింది.ఇక ఇప్పుడు నటిగా మరోసారి రీ ఎంట్రీ ఇచ్చింది లక్ష్మి.
సోషల్ మీడియాలో( Social media ) కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.
పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఈ వయసులో కూడా తన అందాలను బయటపెడుతుంది.దీంతో ఈమెకు బాగా ట్రోలింగ్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి.కానీ వాటివి అస్సలు పట్టించుకోదు.ఇక తోటి నటీనటును కలిసినప్పుడు కూడా వారితో బాగా క్లోజ్ గా హగ్గులు ఇస్తూ కనిపిస్తూ ఉంటుంది.యూట్యూబ్లో కూడా ఛానల్ క్రియేట్ చేసుకుని అందులో కూడా బాగా వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది.
ఇక ప్రతిరోజు ఏదో ఒక వర్క్ విషయంలో బాగా బిజీగా ఉంటుంది లక్ష్మి.అవన్నీ సోషల్ మీడియా ద్వారా బయట పెడుతూ బాగా రచ్చ చేస్తూ ఉంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను కొన్ని ఫొటోస్ పంచుకుంది.
అందులో తను చెట్ల పొదల లో ఉన్నట్లు కనిపించింది.ఇక అక్కడ సెల్ఫీ దిగి ఇన్ స్టా లో పంచుకుంది.
దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో ఆ ఫోటోలు చూసిన కొందరు ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.కారణం ఏంటంటే ఆమె వేసుకున్న డ్రెస్ పట్ల కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఓ నెటిజన్.ఏవండీ ఇవన్నీ అవసరమా అండి మనకు.
అడవిలో ఆ డ్రెస్ అంటి.అంటేనేమో అన్నారంటారు.
మీరు మాత్రం కావాలని ఇలా చేస్తుంటారు అని కామెంట్ చేశారు.దీంతో మిగతా నెటిజెన్స్ కూడా ఆ కామెంట్ కు మద్దతు పలుకుతున్నారు.