బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్( KCR ) కాంగ్రెస్ ను మాత్రమే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నారా ? ఆయన ఫోకస్ అంతా హస్తం పార్టీపైనే ఉందా ? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.ఈ మద్య కేసిఆర్ గాని, బిఆర్‌ఎస్ నేతలుగాని కాంగ్రెస్ పార్టీ( Congress Party ) టార్గెట్ గానే విమర్శలు గుప్పిస్తున్నారు.
దీన్ని బట్టి చూస్తే బీజేపీని( BJP ) ప్రత్యర్థిగా ఏమాత్రం భావించడం లేదనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం.నిజానికి గత ఆర్నెళ్ళ ముందు తెలంగాణలో బిఆర్‌ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి పార్టీ బీజేపీనే అనే భావన కలిగించేలా కమలనాథులు వ్యవహరించారు.
జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే మెరుగైన ఫలితాలు రాబట్టడం, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం.మునుగోడు బైపోల్ లో కూడా బిఆర్‌ఎస్ కు దీటుగా ఓటు శాతం నమోదు చేయడంతో బిఆర్‌ఎస్ కు( BRS ) మెయిన్ ప్రత్యర్థి పార్టీ బీజేపీనే అని భావించారంతా కానీ కర్నాటక ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది.
ఆ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా ఓటమిపాలు కావడంతో ఆ ప్రభావం తెలంగాణ బీజేపీపై గట్టిగానే ప్రభావం చూపింది.ఆ ఎన్నికల్లో అపజయం తరువాత తెలంగాణ బీజేపీలో అధ్యక్ష మార్పు చేయడంతో పార్టీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
అంతకు ముందు అధ్యక్ష పదవిలో యమ దూకుడు చూపిన బండి సంజయ్.( Bandi Sanjay ) పదవి పోయిన తరువాత సైలెంట్ కావడం, బండి రేంజ్ లో ఇతర నేతలు ప్రభావం చూపకపోవడం, ఇదే సమయంలో పార్టీలో అంతర్గత కుమ్ములాటాలు పెరగడంతో బీజేపీ ఒక్కసారిగా డౌన్ అయింది.ఇటు కర్నాటక ఎన్నికల్లో లభించిన విజయంతో హస్తం పార్టీ అనూహ్యంగా జోరందుకొని ప్రస్తుతం ఎన్నికల వేళ బిఆర్‌ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి పార్టీగా మారింది.
దీంతో ప్రస్తుతం బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ దృష్టంతా కాంగ్రెస్ కు కళ్ళెం వేయడంపైనే ఉందనేది విశ్లేషకులు చెబుతున్నా మాట.ప్రస్తుతం కేసిఆర్ ప్రచారల్లో చేస్తున్న వ్యాఖ్యలలో నాలుగింత మూడో వంతు కాంగ్రెస్ పై విమర్శలు చేయడంపైనే ఫోకస్ పెట్టారు.దీన్ని బట్టి కేసిఆర్ టార్గెట్ ఓన్లీ కాంగ్రెస్ అనే తెలుస్తోంది.
మరి హస్తం పార్టీకి గులాబీ బాస్ ఎలా స్పీడ్ బ్రేక్ వేస్తాడో చూడాలి.