సౌత్ ఇండియా( South india ) లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన వాళ్ళు ప్రారంభం లో సపోర్టింగ్ రోల్స్ మరియు విలన్ రోల్స్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళే.అలాంటి వారిలో నేటి తరం సౌత్ ఇండియన్ స్టార్ విక్రమ్( Vikram ) కూడా ఉన్నాడు.
కెరీర్ ప్రారంభం లో ఈయన తమిళ సినిమాలతో పాటుగా డైరెక్ట్ తెలుగు సినిమాలు కూడా కొన్ని చేసాడు. అక్క పెత్తనం చెల్లి కాపురం, చిరునవ్వుల వరం ఇస్తావా, బంగారు కుటుంబం , ఆడాళ్ళ మజాకా, అక్కా బాగున్నావా, మెరుపు , కుర్రాళ్ళా మజాకా , 9 నెలలు మరియు యూత్ వంటి సినిమాలు చేసాడు.
వీటిల్లో ‘బంగారు కుటుంబం’ అనే చిత్రం సూపర్ హిట్ అయ్యింది.ఇందులో అక్కినేని నాగేశ్వర రావు ప్రధాన పాత్ర పోషించాడు.
మిగిలిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.కొన్ని యావరేజి సినిమాలు కూడా ఉన్నాయి.
అయితే అప్పట్లో ఈయన ఎక్కువగా శ్రీకాంత్ సతీమణి ఊహా తోనే తెలుగులో సినిమాలు చేసేవాడు.
అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఊహ’( Ooha movie ) అనే చిత్రం గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి.ఇందులో విక్రమ్ నెగటివ్ రోల్ లో కనిపిస్తాడు.ఈ చిత్రం లో డైరెక్టర్ శివాల ప్రభాకర్ ఆయనని ఎంత క్రూరంగా చూపించాలో అంత క్రూరంగా చూపిస్తాడు.
ఈ చిత్రం లో కమెడియన్ అలీ దాదాపుగా హీరో రేంజ్ రోల్ ని చేసాడు.వీళ్ళ ముగ్గురి మధ్యనే ఈ కథ సాగుతుంది.ఈ చిత్రం తర్వాత విక్రమ్ మళ్ళీ నెగటివ్ రోల్స్ లో కనిపించలేదు.ఈ సినిమాని ఎవరైనా చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో అందుబాటులోనే ఉంది, అందులో చూడొచ్చు.
విక్రమ్ ఈ చిత్రం లో తన నట విశ్వరూపం చూపించాడనే చెప్పాలి.అలా ఆయన అప్పట్లో తెలుగు మరియు తమిళ సినిమాలను సమాంతరం గా చేస్తూ వచ్చాడు కానీ, ఆయనకీ మొట్టమొదటి భారీ బ్లాక్ బస్టర్ పడింది మాత్రం తమిళ్ లోనే.
అక్కడ ఆయన 2001 వ సంవత్సరం లో చేసిన కాశీ అనే చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా విక్రమ్ కి ఫిల్మ్ ఫేర్ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది.
ఇక ఆ తర్వాత ఆయన హీరో గా నటించిన ‘జెమినీ’ అనే చిత్రం తమిళనాడు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది.ఈ చిత్రాన్ని తెలుగు లో వెంకటేష్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.’జెమినీ’ చిత్రం తర్వాత విక్రమ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు, వరుసగా హిట్టు మీద హిట్టు కొడుతూ తమిళ నాడు లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత పెద్ద స్టార్ నేనే అనే రేంజ్ కి ఎదిగాడు.ఇక ఆయన హీరో గా నటించిన ‘అపరిచితుడు’ అనే చిత్రం సౌత్ ఇండియా లోనే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.ఇందులో విక్రమ్ నటన ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు.
ఆ సినిమా తర్వాత నుండి ఆయన కమల్ హాసన్ తరహా లో విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ వచ్చాడు.ఇప్పుడు రీసెంట్ గా ఆయన ‘తంగాలాన్’ అనే చిత్రం లో హీరో గా నటిస్తున్నాడు, ఇందులో ఆయన లుక్ ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
గుర్తు పట్టలేని విధంగా ఉన్న ఆయన లేటెస్ట్ గెటప్ సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది.పొన్నియన్ సెల్వన్ సిరీస్ భారీ బ్లాక్ బస్టర్ తో మంచి ఊపు మీదున్న విక్రమ్ తన సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగిస్తాడో లేదో చూడాలి.