సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు( Samantha ) గురించి ప్రతీ ఒక్కరికి తెలుసు.ఈమె తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుంది.
ఇటీవలే ఈ భామ శాకుంతలం సినిమాతో వచ్చి అట్టర్ ప్లాప్ అందుకుంది.ఈ సినిమాతో ఈమె తన ఫ్యాన్స్ ను సైతం మెప్పించలేక పోయింది.
దీంతో సమంత హోప్స్ అన్నినెస్ట్ సినిమాల పైనే పెట్టుకుంది.
అందుకే ఈ ప్లాప్ నుండి బయటకు వచ్చి తన నెక్స్ట్ సినిమాలపై ద్రుష్టి పెట్టింది.
ఈమె లైనప్ లో ఉన్న చిత్రాల్లో ఖుషి సినిమా( Kushi ) ఒకటి.విజయ్ దేవరకొండ, సమంత కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమాను శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు.
ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపు కుంటుంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.
సెప్టెంబర్ 1న ఈ సినిమా రిలీజ్ కానుంది.

మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో అని ఇటు విజ ఫ్యాన్స్ అటు సమంత ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా సమంత గురించి నెట్టింట ఒక రూమర్ వైరల్ అవుతుంది.ఈమె మరోసారి లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి( Nandini Reddy )తో జోడీ కట్టబోతుంది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే ఈ కాంబోలో ఓ బేబీ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది.తాజాగా నందిని రెడ్డి తన తదుపరి సినిమా డీజే టిల్లుతో బ్లాక్ బస్టర్ అందుకున్న సిద్ధూ కొన్నలగడ్డతో ఉంటుంది అని అధికారికంగా తెలిపారు.మరి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోనే సమంత నటిస్తుంది అని టాక్.దీంతో సమంత – సిద్ధూ కలిసి రొమాన్స్ చేయబోతున్నారా అని క్రేజీ న్యూస్ హల్ చల్ చేస్తుంది.
చూడాలి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో.







