టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు నరేష్ ఈమధ్య కాలంలో వరుస వివాదాల ద్వారా వార్తలలో నిలుస్తున్నారు.ఈయన కెరియర్ పరంగా కాకుండా తన వ్యక్తిగత విషయాల వల్ల వార్తల్లో నిలుస్తున్నారు.
నరేష్ ఇప్పటికే మూడు వివాహాలు చేసుకుని తన ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చారు.అయితే ఈయన మరోసారి నాలుగవ వివాహానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవిత్ర లోకేష్ తో ఈయన గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే వీరి రిలేషన్ ను అధికారకంగా ప్రకటిస్తూ త్వరలోనే మేము పెళ్లి చేసుకోబోతున్నామని ఒక వీడియో ద్వారా తెలియజేశారు.
అయితే గతంలో ఒకసారి వీరి విషయం తెలిసినటువంటి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి తనకు విడాకులు ఇవ్వకుండా నరేష్ పవిత్ర లోకేష్ ను ఎలా పెళ్లి చేసుకుంటారంటూ పెద్ద ఎత్తున వివాదం సృష్టించింది.అయితే వీరిద్దరికి విడాకులు పూర్తి కావడంతో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే నరేష్ కి ఎంతో సన్నిహితంగా ఉండే నిర్మాత చిట్టిబాబు వీరి వ్యవహారంపై స్పందించారు.

ఈ సందర్భంగా చిట్టిబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రమ్య నరేష్ విడాకుల విషయం కోర్టులో పూర్తి అయిందని అయితే ఆమెకు భరణం కింద ఎంత ఇవ్వాల్సి వచ్చినా తాను ఇస్తానని నరేష్ తెలిపినట్లు చిట్టిబాబు వెల్లడించారు.నరేష్ కు వేలకోట్ల ఆస్తులున్నాయి తన తల్లి విజయనిర్మల నుంచి ఈయనకు కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు వచ్చాయి.అందుకే తాను కోట్లలో భరణం చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడని చిట్టిబాబు తెలిపారు.
ఇక రమ్య రఘుపతి కుమారుడికి నరేష్ తల్లి ఇచ్చిన ఆస్తిలో వాటా ఉంటుందని నరేష్ కష్టార్జితం విషయంలో అలా ఉండదని చిట్టిబాబు ఈ సందర్భంగా తెలిపారు.చిట్టి బాబు మాటలు చూస్తే నరేష్ మాత్రం రమ్య రఘుపతికి భారీగానే భరణం చెల్లించనున్నారని తెలుస్తోంది.