తెలుగు చలనచిత్ర రంగంలో సురేష్ ప్రొడక్షన్ అధినేత సురేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతలలో ఒకరు.
ఎన్నో వైవిధ్యకరమైన సినిమాలు తెరకెక్కించటం జరిగింది.అటువంటి టాప్ నిర్మాత హైదరాబాద్ ఫిలింనగర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావటంతో కారు దిగి మరీ ట్రాఫిక్ ని నియంత్రించారు.
వాహనాదారులకు సూచనలు చేస్తూ.ట్రాఫిక్ నీ నియంత్రణ లోకి తీసుకురావడం జరిగింది.
టాలీవుడ్ టాప్ నిర్మాత ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉండటంతో వాహనాదారులను ఎంతగానో ఆకట్టుకుంది.దీంతో అక్కడే ఉన్న కొంతమంది ఈ సన్నివేశాలను ఫోన్ లో చిత్రీకరించారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అగ్ర నిర్మాత మాత్రమే కాదు బాధ్యత గల పౌరుడు అంటూ నిర్మాత సురేష్ బాబు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

హైదరాబాద్ లో రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది.మెట్రో వంటి సేవలు అందుబాటులో ఉన్నా గాని ట్రాఫిక్ సమస్య మాత్రం హైదరాబాద్ వాసులను పట్టిపీడిస్తోంది.ఈ క్రమంలో జూబ్లీహిల్స్ లోని ఫిలిం నగర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావటంతో సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు మొత్తం క్లియర్ చేయడం సంచలనంగా మారింది.







