సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు ఎంతో మంది అభిమానులు ఉంటారు.అయితే కొన్నిసార్లు వారి అభిమానాన్ని చాలా వినూత్నంగా ప్రదర్శిస్తూ ఉంటారు.
ముఖ్యంగా హీరోల పుట్టినరోజు వేడుకల సందర్భాలలో అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ తమ అభిమానాన్ని చాటుకుంటారు.అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ కి కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారనే విషయం మనకు తెలిసిందే.
తాజాగా ఈయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు తనకు శుభాకాంక్షలు చెప్పడం కోసం పోలీసులతో దెబ్బలు కూడా తిన్నారంటే సల్మాన్ ఖాన్ కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థమవుతుంది.
అయితే తమ అభిమాన హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని ఒక అభిమాని చేసిన పనికి సల్మాన్ ఖాన్ చాలా ఫిదా అయిపోయారు.
ఇంతకీ అభిమాని చేసిన పని ఏంటి అనే విషయానికి వస్తే తన అభిమాన హీరోని కలవడం కోసం మధ్యప్రదేశ్ జబల్ పూర్ కి చెందిన సమీర్ అనే అభిమాని ఏకంగా ముంబైకి సైకిల్ పై ప్రయాణం చేస్తూ తన అభిమాన నటుడు సల్మాన్ ఖాన్ ని కలిశారు.ఇలా ఐదు రోజుల పాటు సైకిల్ తొక్కుతూ 1100 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు.
సైకిల్ పై అంత దూరం ప్రయాణం చేసి చివరికి తన అభిమాన హీరోని కలిశాడు.

ఇక సల్మాన్ ఖాన్ తనని కలవడం కోసం ఐదు రోజులపాటు సైకిల్ పై ప్రయాణం చేసి వచ్చారని తెలియడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా సమీర్ తో కలిసి సెల్ఫీలకు ఫోజులిచ్చాడు.అదేవిధంగా ఆయన ప్రయాణించిన సైకిల్ దగ్గర నిలబడి కూడా ఫోటోలు దిగారు.ఇలా తనకోసం అంత కష్టపడి వచ్చిన అభిమానిని ఏమాత్రం నిరాశపరచకుండా సల్మాన్ ఖాన్ తనతో నవ్వుతూ మాట్లాడారు.
తాను సల్మాన్ ఖాన్ ను దేవుడితో సమానంగా భావిస్తానని చెప్పడమే కాకుండా సల్మాన్ ఖాన్ కి తాను పిచ్చ అభిమానిని అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు.మొత్తానికి సమీర్ సల్మాన్ ఖాన్ తో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







