అందం తో కాకుండా కేవలం టాలెంట్ తో సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు,అలాంటి వారిలో ఒకరు ఐశ్వర్య రాజేష్( Aishwarya Rajesh )నీతం అవన్emఅనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన ఈమె, దాదాపుగా 50 సినిమాల్లో హీరోయిన్ గా నటించిందంటే సాధారణమైన విషయం కాదు.మిగిలిన హీరోయిన్స్ తో పోలిస్తే అందం విషయం లో కాస్త తక్కువే అయ్యినప్పటికీ, అభినయం విషయం లో తనకి తానే సాటి అనే రీతిలో ముందుకు దూసుకుపోయింది.
తెలుగు లో ఈమె ‘కౌసల్య కృష్ణమూర్తి’, ( Kousalya Krishnamurthy )’టక్ జగదీష్’,’రిపబ్లిక్’ మరియు ‘వరల్డ్ ఫేమస్ లవర్‘ వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.వీటిల్లో ‘టక్ జగదీష్’ సినిమా ద్వారా ఈమె మంచి పేరు ప్రఖ్యాతలు సాధించింది.
కౌసల్య కృష్ణమూర్తి సినిమా కూడా టీవీ టెలికాస్ట్ లో మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.
అయితే ఈమె ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది అనుకుంటే పెద్ద పొరపాటే.ఈమె తండ్రి రాజేష్ అప్పట్లో మన టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ సినిమాలలో హీరో గా నటించాడు.వాటిల్లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన చిత్రం ‘నెలవంక( Nelavanka )’ అనే చిత్రం.
ప్రముఖ దర్శకుడు జంధ్యాల తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది.దాంతో ఆ సినిమా తర్వాత ఆయనకీ పలు చిత్రాలలో హీరోగా నటించే అవకాశాలు దక్కాయి.
కానీ ఒక్క చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు, దాంతో రాజేష్ ఇండస్ట్రీ లో పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు.ఆ తర్వాత ఆయన చెన్నై లో స్థిరపడి కొన్నాళ్ళు వ్యాపారాలు చేసాడు,కానీ కాలం కలిసిరాక ఐశ్వర్య రాజేష్ చిన్నతనం లో ఉండగానే చనిపోయాడు.
అప్పటి నుండి ఐశ్వర్య రాజేష్ కుటుంబానికి పెద్దగా ఆమె అమ్మ నిలబడి పిల్లలు అందరినీ చదివించి ఇంతటి వాళ్ళను చేసింది.
ఇక తండ్రి నటుడు అవ్వడం తో ఐశ్వర్య రాజేష్ చిన్నతనం లో ఉన్నప్పుడే ఒక సినిమాలో నటించింది.నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరో గా , బాపు దర్శకత్వం లో తెరకెక్కిన ‘రామ బంటు‘ అనే చిత్రం లో బాలనటిగా నటించింది ఐశ్వర్య రాజేష్.ఆ తర్వాత ఈమె మళ్ళీ 2010 వ సంవత్సరం వరకు సినిమాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
తండ్రి చనిపోయినప్పటి నుండి ఇల్లు ఆర్ధిక కష్టాల్లో పడడం తో ఐశ్వర్య రాజేష్ చిన్నతనం నుండే అమ్మకి సహాయం పడేందుకు చిన్నచిన్న పనులు చేస్తూ ఇంట్లో డబ్బులు ఇచ్చేది.ఆ స్థాయి నుండి నేడు ఆమె కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ కి ఎదిగింది అంటే ఆమె కష్టం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగు తమిళ సినిమాలు, మరియు మూడు మలయాళం సినిమాలు ఉన్నాయి.