ప్రస్తుతం త్రిబుల్ ఆర్ సినిమా విడుదలై భారీగా వసూళ్లు సాధిస్తూ రికార్డులు కొల్లగొడుతుంది.అయితే ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఒకరి గురించి అందరూ మాట్లాడు కుంటున్నారు.
నటనకు ఫిదా అయిపోయాము అంటూ కామెంట్లు పెడుతున్నారు.దీంతో ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇంతకీ ఎవరి గురించి చర్చించుకుంటున్నారు అనుకుంటున్నారు.మీరు అనుకుంటున్నట్లుగా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ల గురించి కాదు.
ఎందుకంటే ఈ ఇద్దరు హీరోల యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే ఎన్నో సినిమాల్లో ఇద్దరు ప్రూవ్ చేసుకున్నారు.
ఇక త్రిబుల్ ఆర్ సినిమాలో వీరిద్దరు యాక్టింగ్ లో మరో మెట్టు ఎక్కారు అనే చెప్పాలి.
కానీ ఇప్పుడు చర్చించుకుంటూ ఉంది మాత్రం ఈ ఇద్దరు హీరోల గురించి కాదు అటు హీరోయిన్ ల గురించి కూడా కాదు ఇంతకీ ఎవరి గురించి అంటే.
త్రిబుల్ ఆర్ సినిమాకు కీలక మలుపుగా మారినా మల్లీ గురించి.అదేనండి మళ్లీ పాత్రలో నటించిన చిన్నారి గురించి.
చిన్నారి కనిపించేది కొంత సేపు.కాని ఆ కొంత సమయం లోనే తన నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది.
తనకు ఉన్నవి చిన్నచిన్న సన్నివేశాలు అయినప్పటికీ ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు తిప్పుకో గలిగింది.నటనకు వయసుతో పని ఏముంది అని నిరూపించింది.
ఇక త్రిబుల్ ఆర్ సినిమా చూసిన తర్వాత మళ్లీ నటనకు ఫిదా అవుతున్న ప్రేక్షకులు ఆమె ఎవరు బ్యాగ్రౌండ్ ఏంటి అని తెలుసు కోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

ఇలా త్రిబుల్ ఆర్ సినిమాలో మల్లి పాత్రలో నటించిన చిన్నారి పేరు ట్వింకిల్ శర్మ ఇక అంతకు ముందు డాన్స్ ఇండియా అనే కాంపిటేషన్లో పాల్గొంది ఈ చిన్నారి.ఇక ఆ తర్వాత ఇండియాస్ బెస్ట్ డ్రమేబేజ్ షోలో టాప్ 8 కంటెస్టెంట్ గా నిలిచి ఎంతో మంది ప్రేక్షకులకు సుపరిచితురాలిగా మారిపోయింది.అంతేకాదు హిందీ ఛానల్స్లో ప్రసారమయ్యే ఎన్నో ఈవెంట్స్లో కూడా పాల్గొని బుల్లితెర ప్రేక్షకులను అలరించింది.

టీవీ షో స్ ద్వారా కూడా ప్రేక్షకులకు దగ్గరయ్యింది.అంతేకాదండోయ్ ఫ్లిప్కార్ట్ లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రకటనలలో కూడా నటించింది ట్వింకిల్ శర్మ. చివరికి రాజమౌళి దృష్టిలో పడింది.జక్కన్న ఊరుకుంటాడా ఏకంగా త్రిబుల్ ఆర్ సినిమా లో కథ మలుపు తిరిగే ఒక కీలక పాత్ర ఇచ్చేసాడు.దీంతో ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు గా మారి పోయింది ట్వింకిల్ శర్మ.
.