తెలుగు సినీ ప్రేక్షకులకు కనడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వం వహించిన కేజిఎఫ్ చాప్టర్ 1,చాప్టర్ 2 సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకొని పాన్ ఇండియా స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.
అంతేకాకుండా యశ్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా కేజీఎఫ్.ఈ సినిమా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి రికార్డులను బద్దలు కొట్టింది.
ఆ సంగతి పక్కన పెడితే మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సెలబ్రెటీలుగా రాణిస్తున్న చాలా మంది కెరియర్ ఆరంభంలో ఎన్నో రకాల ఇబ్బందులు అవమానాలను ఎదుర్కొన్నారు.అలా యశ్( Yash ) కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడట.ఆ విషయంల్లోకి వెళితే.
హీరోగా తనను తాను నిరూపించుకోవడానికి ముందు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు యశ్.ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యశ్ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు.కాగా యశ్ అసలు పేరు నవీన్, కర్ణాటక లోని హసన్ అనే గ్రామంలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు.యశ్ తల్లి తన కుమారుడి పేరు యశ్వంత్ గా మార్చుకున్నారు.
ఇక ఇండస్ట్రీలోకి వచ్చాకా యశ్ గా పేరు మార్చుకున్నారు.
పాఠశాల రోజుల నుంచి నటనపై ఎంతో ఆసక్తి ఉన్న యశ్.16 ఏళ్ల వయసులో ఒక ప్రాజెక్టులో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండటానికి బెంగళూరు( Bengaluru ) వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు.కేవలం రూ.300 తీసుకుని బెంగుళూరు బయలుదేరాడు.అసిస్టెంట్ డైరెక్టర్ అవకాశాలు దొరకకపోవడంతో థియేటర్ ట్రూప్ లో బ్యాక్ డాన్సర్ గా చేరాడు.అప్పుడు అతనికి రోజుకు రూ.50 చెల్లించేవారు.2018లో 18 సంవత్సరాల వయసులో ఒక నాటకంలో ప్రధాన పాత్ర పోషించాడు.2005లో తన భార్య రాధిక పండిట్ తో కలిసి నంద గోకుల అనే సీరియల్లో నటించారు.ఆ తర్వాత 2007లో జంబాడ హుడుగి చిత్రంలో సహయ పాత్ర పోషించారు.ఆ తర్వాత ఏడాది రాకీ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు.ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన యశ్ చివరకు ప్రశాంత్ నీల్ కంటపడ్డాడు.వీరిద్దరి కాంబోలో వచ్చిన కేజీఎఫ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేయడంతో యశ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.