కాజల్ అగర్వాల్ ప్రెగ్నన్సీ ఫుడ్ గురించి మీకు తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో దశాబ్దకాలం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చారు.

 Do You Know The Kajal Agarwal Pregnancy Food Details, Kajal Agarwal, Tollywood,-TeluguStop.com

ఈ విధంగా సుదీర్ఘకాలంపాటు ఇండస్ట్రీలో స్టార్ డమ్ అనుభవించిన కాజల్ అగర్వాల్ వరస ప్రాజెక్టులతో దూసుకుపోయింది.ఇక 2020 లో ఈమె తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను వివాహం చేసుకొని పూర్తిగా వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

వివాహమైన తర్వాత కూడా వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈమె మెగాస్టార్ చిరంజీవి కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కిన ఆచార్య సినిమాలో కూడా నటించింది.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అయితే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ గర్భవతి కావడంతో ఈమె పూర్తిగా తన ప్రెగ్నెన్సీ సమయాన్ని ఆస్వాదిస్తుందని చెప్పాలి.తాను కమిట్ అయిన సినిమాల నుంచి తప్పుకొని పూర్తిగా తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది.

ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ తన బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో కొందరు ఆకతాయిలు ఆమె బాడీ షేమింగ్ గురించి కామెంట్లు చెయడంతో ఈమెకు మద్దతుగా కొందరు హీరోయిన్లు స్పందిస్తూ సదరు నెటిజన్లకు బాగా బుద్ధి చెప్పారు.

ఇదిలా ఉండగా తాజాగా తన ప్రెగ్నెన్సీ సమయంలో తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాను తీసుకునే ఆహార పదార్థాల పై ఎంతో శ్రద్ధ వహిస్తోంది.ఈ క్రమంలోనే ప్రెగ్నెన్సీ సమయంలో తాను ఎంతగానో ఇష్టపడే ఫుడ్ గురించి తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఫోటోని షేర్ చేయడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ డెజర్ట్‌ల ఫొటోలను షేర్ చేసింది.“బ్యాక్‌లావా, బుట్టకేక్‌లు, క్రోక్‌బౌచే’ వంటి ఆహార పదార్థాలు తీసుకుంటోంది. ఇలా ఈ ఫోటోని షేర్ చేయడమే కాకుండా మీరు ఏం తీసుకుంటారో చెప్పండి అంటూ నెటిజన్లను సలహా అడిగారు.

ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు కాజల్ అగర్వాల్ పోస్ట్ పై స్పందిస్తూ ఆమెకు పలు ఆరోగ్య సూత్రాలను తెలియజేస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలని ఎంతో ప్రేమగా తెలియజేశారు.ప్రస్తుతం ఏడవ నెల గర్భవతి అయిన కాజల్ అగర్వాల్ తన శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోవడంతో చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తోంది.ఇక ఈమె ఆరోగ్యంపట్ల సమంత నిత్యం స్పందిస్తూ పోస్ట్ చేయడం గమనార్హం.ఇక సినిమాల విషయానికొస్తే కాజల్ అగర్వాల్ నటించిన ఆచార్య సినిమా వచ్చే నెల విడుదల కానుంది.

ఇక ఈ సినిమా తర్వాత నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ ది ఘోస్ట్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అయితే అప్పటికే తన ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కావడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.

Actress Kajal Aggarwal Pregnancy Diet Kajal Agarwal Baby Bump

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube