టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.
అంతేకాకుండా ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు మెగాస్టార్.ఇకపోతే మెగాస్టార్ మంచితనం గురించి మనందరికీ తెలిసిందే.
శత్రువులను కూడా దగ్గరకు తీసుకునే ఉదార స్వభావం గల వ్యక్తి చిరంజీవి.ఇక ఎంతోమందిని ఆపదలో ఆదుకొని రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్( Real Life Hero ) లో కూడా హీరో అనిపించుకున్నాడు చిరంజీవి.
వీటింన్నిటితో పాటు చిరంజీవి ఒక్కసారి ఒకరిని నమ్మాడు అంటే చాలా బలంగా నమ్ముతాడు.
వాళ్ళు చెప్పేవి గుడ్డిగా ఫాలో అవుతాడు.ఇదే ఆయన కొంప ముంచుతుంది అని అంటున్నారు విశ్లేషకులు.ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడంతో నిజమే అన్న అనుమానం రాక మారదు.
కాగా ఇటీవల చిరంజీవి భోళా శంకర్ సినిమా( Bhola Shankar )తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ను చవిచూసింది.
అంతేకాకుండా చిరంజీవి కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాగా నిలిచింది.ఇలాంటి సినిమాలను చిరంజీవి చెయ్యడానికి ఒక డైరెక్టర్ కారణం అని అంటున్నారు.
ఆ డైరెక్టర్ మరెవరో కాదు వీవీ వినాయక్( Director VV Vinayak ).ఈయన మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని, అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి మంచి స్నేహితుడు కూడా.
అయితే ఈయన గత కొంత కాలంగా చిరంజీవి తోనే కలిసి ఉంటున్న తెలిసిందే.చిరంజీవి ఒక కొత్త సినిమా ఒప్పుకోవాలంటే వీవీ వినాయక్ అప్రూవల్ కూడా కచ్చితంగా ఉండాల్సిందే.కథ చర్చల్లో కచ్చితంగా వీవీ వినాయక్ కూడా కూర్చుంటాడట.అయితే రీసెంట్ గా విడుదలైన భోళా శంకర్ సినిమాని చెయ్యమని సజ్జస్ట్ చేసింది కూడా వీవీ వినాయకేనట.
డైరెక్టర్ మెహర్ రమేష్( Director Meher Ramesh ) కి ఖచ్చితంగా ఒక అవకాశం ఇవ్వాలి అని బలవంత పెట్టి మరి చిరంజీవితో ఈ సినిమాను చేసేలా ఒప్పించారట.మూవీ పెద్ద ఫ్లాప్ కి కారణం వీవీ వినాయక్ అని , ఇతనిని వెంటనే పక్కన పెట్టండి అంటూ చిరంజీవిని సోషల్ మీడియా ద్వారా వేడుకుంటున్నారు ఫ్యాన్స్.
చిరంజీవి వెన్నంటే ఉంటూ నమ్మించి దారుణంగా మోసం చేయడంతో పాటు వెన్నుపోటు పొడుస్తున్నాడు అంటూ మెగా అభిమానులు( Mega Fans ) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.