రాధేశ్యామ్ విషయంలో ఆ స్వామి చెప్పినట్టే జరిగింది.. అప్పుడు నవ్వుకున్నా అంటూ?

చాలా సంవత్సరాల క్రితమే రాధేశ్యామ్ మూవీ షూటింగ్ మొదలు కాగా ఈ సినిమా ఎన్నో ఆవాంతరాలను దాటుకుని మరో రెండు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.జిల్ సినిమాతో యావరేజ్ రిజల్ట్ ను అందుకున్న రాధాకృష్ణ కుమార్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

 Director Radhakrishna Kumar Interesting Comments About Radheshyam Movie , Radha-TeluguStop.com

ఒక స్వామీజీ రాధేశ్యామ్ సినిమా 2022 సంవత్సరంలో విడుదలవుతుందని చెప్పారని రాధాకృష్ణ కుమార్ తెలిపారు.

ఈ కథలో పరమహంస పాత్రను ఒక పాత్రను బేస్ చేసుకుని రాశానని రాధాకృష్ణ కుమార్ వెల్లడించారు.

ఒక స్వామీజీకి జాతకం చూపిస్తే 2022లో సినిమా రిలీజ్ అని చెప్పడంతో తాను నవ్వుకున్నానని రాధాకృష్ణ కుమార్ చెప్పుకొచ్చారు.మనకు తెలియని చాలా శాస్త్రాలు ఉన్నాయని రాధాకృష్ణ కుమార్ అన్నారు.

మనకు తప్ప ఎవరికీ తెలియని విషయాలను జ్యోతిష్కులు చెబుతారని ఆయన తెలిపారు.మనుషులకు తోకలు ఉండేవని కానీ అవసరం లేనివి అంతరించిపోయాయని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Average Result, Krishnamraju, Poojahegde, Radheshyam, Theaters-Movie

జ్యోతిష్య శాస్త్రం మాత్రం ఎందుకు అంతరించిపోలేదని రాధాకృష్ణ కుమార్ ప్రశ్నించారు.మన నమ్మకం నుంచే ఏదైనా ఉంటుందని ఆయన అన్నారు.ప్రభాస్ తో పూజా హెగ్డేకు గొడవయ్యే ఛాన్స్ లేదని అవి ఆధారాలు లేని వార్తలు అని ఆయన తెలిపారు.నేను విడాకులు తీసుకున్నానని కూడా ప్రచారం చేశారని ఆయన చెప్పుకొచ్చారు.

పూజా హెగ్డే డెడికేషన్ ఉన్న యాక్టర్ అని రాధాకృష్ణ కుమార్ అన్నారు.

ప్రభాస్, పూజా హెగ్డే కరోనా సమయంలో రిస్క్ ఉన్నా షూట్ లో పాల్గొన్నారని ఆయన తెలిపారు.

కృష్ణంరాజు ప్రభాస్ కు గురువు అని దర్శకుడు తెలిపారు.సినిమాలో కృష్ణంరాజు, ప్రభాస్ కు కొన్ని విషయాలకు సంబంధించి అభిప్రాయ భేదాలు ఉంటాయని దర్శకుడు అన్నారు.

కృష్ణంరాజు ఆ పాత్రకు పర్ఫెక్ట్ అని దర్శకుడు చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube