ఎప్పటికీ ఆయనే మాకు దేవుడు.. సంస్కృతిని తప్పుగా చూపించము: ప్రశాంత్ వర్మ

సంక్రాంతి పండుగ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ( Prashanth Varma ) దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ ( Hanuman ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదలై అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకుంది.

 Director Prashanth Varma Interesting Comments About Devotional Movies, Adipurush-TeluguStop.com

కేవలం 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ కాబట్టి పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.ఇక ఇప్పటివరకు ఈ తరహా సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో వచ్చాయి నందమూరి తారక రామారావు( Nandamuri  Taraka Ramarao ) మహాభారతం రామాయణం కథల ఆధారంగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

కానీ ఏ సినిమా కూడా ఎప్పుడూ విమర్శలను ఎదుర్కోలేదు.

Telugu Adipurush, Hanuman, Prashanth Varma, Sr Ntr-Movie

ఇకపోతే నేడు ఎన్టీఆర్ వర్ధంతి కావడంతో ఆయనని గుర్తు చేసుకుంటూ ప్రశాంత్ వర్మ చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఎన్టీఆర్ ( NTR )గారు ఎన్నో గొప్ప గొప్ప పాత్రలలో నటించారు కానీ ఎప్పుడు విమర్శలు ఎదుర్కోలేదు ఎన్టీఆర్ గారు మాకు దేవుడు అంటూ ప్రశాంత్ వర్మ కామెంట్స్ చేశారు.ఎన్టీఆర్ గారు సినిమాలు విడుదలయితే పండగ చేసుకునే వాళ్ళం అంటూ ప్రశాంత్ తెలిపారు .ప్రతి ఇంట్లో రాముడు కృష్ణుడు విగ్రహం ఉన్నట్టు ఎన్టీఆర్ పోస్టర్స్ కూడా ఉంటాయని ఈయన తెలిపారు.

Telugu Adipurush, Hanuman, Prashanth Varma, Sr Ntr-Movie

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో దేవుళ్ళ సినిమాలు వచ్చాయని ఏ సినిమాలో కూడా దేవుళ్లను తప్పుగా చూపించలేదని ప్రశాంత్ వర్మ తెలిపారు.ఇక నేను ఈ జానర్ లో వచ్చిన ప్రతి ఒక్క సినిమాని చూశానని ఈయన తెలిపారు.ఇక ఈ సినిమాలు చూసి నేను సినిమా ఎలా చేయాలి? ఎలా తీయకూడదు అనేది కూడా నేర్చుకున్నానని తెలిపారు.ఇక టాలీవుడ్ డైరెక్టర్ల గురించి మాట్లాడాలి అనుకోవడం లేదు అంటూ ప్రశాంత్ వర్మ ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube