బాపు.ఆయన పోయి అప్పుడే ఎనిమిదేళ్లు గడిచింది.నేడు ఆయన 91వ జయంతి.ఎందరో మహానుభావులు అందరిలో బాపు కూడా ఒకరు.ఆయన ఖచ్చితంగా ఎక్కడో ఒకచోట మళ్లి పుట్టే ఉంటాడు.సినిమా ఇండస్ట్రీ గురించి పుస్తకం రాయాల్సివస్తే అందులో మొదటి పేజీ బాపు గురించి రాయాలి.
ఎంతో మందికి స్ఫూర్తి .సినిమా నిఘంటువు లాంటి వ్యక్తి.ఆయన తీసిన మొట్టమొదటి సినిమా సాక్షి.ఇది 1967 వ సంవత్సరంలో రిలీజ్ అయింది.సాక్షి సినిమా లో కృష్ణ, విజయనిర్మల హీరో హీరోయిన్స్ గా నటించారు.ఇది ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో కృష్ణ మరియు విజయ్ నిర్మల జంటకి మంచి పేరు వచ్చింది.ఆ తర్వాతే వీరిద్దరూ కూడా పెళ్ళి చేసుకున్నారు.అయితే బాపు ఈ సినిమాని కేవలం 30 రోజుల్లోనే పూర్తి చేశారు.టాలీవుడ్ లో మొట్ట మొదటి సారిగా అవుట్ డోర్ లో తీసిన సినిమాగా సాక్షి సినిమాకి రికార్డు ఉంది.
అప్పటివరకు తెలుగు సినిమాలన్నీ కూడా స్టూడియోలోనే తీసేవారు.కానీ పూర్తిగా అవుట్ డోర్ లో తీసిన ఫస్ట్ సినిమా, అది కూడా 30 రోజుల్లో పూర్తి చేసిన సినిమా సాక్షి కావడం నిజంగా ఎంతో గర్వపడాల్సిన విషయం.

ఇలా కూడా ఒక సినిమా తీయొచ్చా అని తెలిసేవిధంగా తీసి తన సమకాలీన దర్శకులతో పాటు అనే ఆ తర్వాత వచ్చే వారికి కూడా మార్గదర్శకం చేశారు బాపు గారు.ఇక అప్పట్లో ప్రథమ శ్రేణి సినిమా ఫోటోగ్రాఫర్స్ అంతా కూడా బాపు గారితో సినిమా చేయడానికి ఉత్సాహం చూపించేవారు.ఎందుకంటే కేవలం బాపుగారు ఇచ్చే స్టోరీ బోర్డు చూస్తే చాలు ఎక్కడ ఎలా కెమెరా పెట్టాలి ఎలా ఫ్రేమ్ సెట్ చేయాలి అనే విషయం కెమెరా తీసే వ్యక్తికి చాలా సులభంగా అర్థమవుతుంది.

అంతే కాదు ఆ రోజు తీయవలసిన అన్ని సన్నివేశాల తాలూక స్టోరీ బోర్డ్ బాపుగారు ముందుగానే పెయింటింగ్స్ రూపంలో చూపించేవారు.దాంతో ఆ పెయింటింగ్స్ చూస్తే చాలు సినిమా ఎలా తీయాలో తెలిసిపోతుంది.అదే దర్శకుడు బాపు యొక్క గొప్పతనం.
ఇక బాపు ఎంతో మంచి స్థిత ప్రజ్ఞుడు అని కూడా అంటూ ఉంటారు.ఎందుకంటే విజయం వచ్చిన అపజయం వచ్చినా ఆయన ఒకేలా ఉంటారు కాబట్టి.