రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న దిల్ రాజు... అసలు నిజం ఏంటంటే?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇక ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ నిర్మాత ఎవరు అంటే నిర్మాత దిల్ రాజు అని చెప్పవచ్చు.

 Dil Raju Enter Into Politics Raju, Kcr, Political Entry, Nizamabad, Tollywood-TeluguStop.com

అయితే దిల్ రాజు కేవలం నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా కూడా మంచి విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు.ఇదిలా ఉంటే రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.

అయితే గత ఎన్నికల ముందే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి దిల్ రాజు పోటీ చేయాలని ప్రయత్నించారు.

అందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా భేటీ అయ్యారు దిల్ రాజు.

మళ్లీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ పోటీలకు దూరమయ్యాడు.మరి దిల్ రాజు సొంత జిల్లా నిజామాబాద్ కాబట్టి రాబోయే ఎన్నికలలో పోటీ అక్కడినుంచే ఉండబోతుంది.

మరి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? లేకపోతే ఎంపీగా పోటీ చేస్తారా అన్నది త్వరలోనే తెలియనుంది.అయితే ఆ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కే కావచ్చు అని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.

Telugu Dil Raju, Nizamabad-Movie

శాసన మండలి, రాజ్యసభ లాంటివి కాకుండా నేరుగా ప్రజల మధ్య పోటీ చేసి ఎమ్మెల్యేగా కానీ లేకపోతే ఎంపీగా కానీ ఎంపిక అవ్వాలి అనేది దిల్ రాజు ఆలోచన అని ఆయన సన్నిహితులు తెలిపారు.మరి ఈ విషయంపై నిజానిజాలు తెలియాలి అంటే దిల్ రాజు అధికారికంగా ప్రకటన ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.ఇకపోతే సిద్దుల రాజు సినిమాల విషయానికి వస్తే.ఇటీవలే ఎఫ్ 3 ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

దిల్ రాజు స్థానంలో సరైన కమర్షియల్ డైరెక్టర్లు లేరు.ఉన్నది ఒక్కరే అతను అనిల్ రావిపూడి.

దాంతో అనిల్ రావిపూడి ని వదులుకోలేక పోతున్నారు దిల్ రాజు.అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబినేషన్లో రానున్న సినిమాకు కూడా నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube