ఈ మధ్య కాలంలో పిల్లలు బాగా ఫోన్ చూడడానికి అలవాటు పడిపోయారు.ఎంతసేపు ఫోన్ లో ఆటలు ఆడడం,వీడియోలు చూడడమే పనిగా పెట్టుకున్నారు పిల్లలు.
ఈ క్రమంలోనే తమిళనాడు ప్రభుత్వం విద్యార్థుల కోసము ఒక వినూత్న ఆలోచన చేసింది.ఆ ఆలోచనలో భాగంగానే తమిళనాడు విద్యార్థులు కేవలం 12రోజుల వ్యవధిలో 263 కోట్ల పదాలను చదివి సరికొత్త రికార్డును సృష్టించారు.
వివరాల్లోకి వెళితే.
తమిళనాడు విద్యాశాఖ పిల్లల కోసం రూపొందించిన ఈ కార్యక్రమంలో దాదాపుగా 18.36లక్షల మంది భాగమై ఈ రికార్డును సాధించారు.తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్లం తేడి కల్వి అంటే ఇంట్లోనే విద్య అనే పథకంను ప్రత్యేకంగా విద్యార్థుల కోసం రూపొందించారు.
విద్యార్థుల్లో పఠన సామర్థ్యాలను మరింత మెరుగుపర్చేందుకు జూన్ 1నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు.అందుకోసం తమిళనాడు పాఠశాల విద్యాశాఖ, గూగుల్ రీడ్ అలాంగ్ యాప్ సమన్వయంతో రీడింగ్ మారథాన్ అనే పేరుతో ఈ కార్యక్రమం చేపట్టింది.
ఈ క్రమంలోనే గూగుల్ యాప్ ను ఉపయోగించి ఎంతో మంది విద్యార్థుల ద్వారా అధికారులు కథలు చదివించారు./br>
ఈ యాప్ లో ఆంగ్లం, తమిళ భాషలను అందుబాటులో ఉంచారు.అంతేకాకుండా విద్యార్థుల యొక్క వయసును ఆధారంగా చేసుకుని పదాల సంఖ్యలో తేడాలను కూడా ఉంచారు.ఈ డిజిటల్ కార్యక్రమంలో భాగంగా 1.8 లక్షల ఇళ్లం తేడి కల్వి సెంటర్లను అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.జూన్ 1 నుంచి 12 తారీకుల మధ్యలో 18.36 లక్షల మంది విద్యార్థులు పాల్గొని 263 కోట్ల పదాలను చదవడం విశేషం అనే చెప్పాలి .జిల్లాలవారీగా పరిశీలిస్తే తిరుచినాపల్లికి చెందిన విద్యార్థులు మొదటి స్థానంలో ఉండగా,మధురైలోని అలంగనల్లూర్ రెండో స్థానంలో ఉంది.అలాగే మధురై జిల్లాలోని మేలూర్ ప్రాంత విద్యార్థులు మూడో స్థానంలో నిలిచారు.పిల్లలు అందరూ ఎంతో సరదాగా చదువుకునేలా రీడ్ అలాంగ్ యాప్ను గూగుల్ రూపొందించడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.