ఆకాశానికి చిల్లు పడింది, ఇది దేనికి సందేశం... శాస్త్రవేత్తలవిశ్లేషణ ఇదే

ఆకాశంలో అప్పుడప్పుడు వింతలు జరుగుతూనే ఉంటాయి.మనకు తెలియని ఎన్నో విషయాలు, వింతలు ఈ అనంత విశ్వంలో ఉన్నాయి.

 Different Shapes Of Cloud In Uae-TeluguStop.com

వాటిల్లో కొన్నింటిని అయినా ఛేదించేందుకు శాస్త్రవేత్తలు ప్రతి నిత్యం, ప్రతి క్షణం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.ఈ అనంత విశ్వంలో ఎప్పుడు ఏ మూలన ఎలాంటి మార్పులు జరుగుతుంటాయో ఎవరు చెప్పలేరు.

ముఖ్యంగా ఆకాశంలో కలిగే మార్పులను ఎవరు కూడా ముందే చెప్పడం కాని, వాటిని ఆపడం కాని చేయలేరు.తాజాగా యూఏఈలో ఒక వింతైన సంఘటన ఆకాశంలో జరిగింది.

ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించిన ఆ ఆకాశ వింతను చూసి అంతా కూడా అవాక్కయ్యారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… యూఏఈలో మార్చి 17వ తారీకున భారీ వర్షం పడింది.

వర్షం పడిన కొద్ది సమయం తర్వాత ఆకాశంలో ఒక వింతైన ఆకారం ఏర్పడింది.అది ఎలా ఉందంటే ఆకాశానికి చిల్లు ఏమైన పడిందా అన్నట్లుగా ఉంది.ఆకాశంలో ఏర్పడిన పరిణామంతో చాలా మంది భయాందోళనలు వ్యక్తం చేశారు.ఆకాశంలో ఏర్పడ్డ చిల్లు కారణంగా ఏదైనా ప్రమాం జరిగే అవకాశం ఉందని కొందరు స్థానికులు భావించారు.

అయితే అలాంటిది ఏమీ లేదని, అదో మేఘాల అమరిక మాత్రమే అంటూ శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.

ఈ విషయమై షార్జాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు క్లారిటీ ఇచ్చారు.ఈ పరిణామాన్ని ఫాల్‌ స్ట్రిక్‌ హోల్‌గా వారు చెబుతున్నారు.అంటే వడగట్టు రంద్రం అని అర్థం.

ఇది ఒక అరుదైన మేఘాల అమరిక మాత్రమే అని, దీనిలో భయపడాల్సిన పని ఏమీ లేదని, రకరకాల మేఘాల ఆకారాలను మనం చూస్తూ ఉంటాం.అందులో ఒక అమరిక ఇది అని, అయితే దీనికి ప్రత్యేకంగా కారణం ఏమీ ఉండదని, మేఘాలు వర్షం పడ్డ తర్వాత కొన్ని ఆకారం మారిపోతాయి.

అలా మారిపోవడంతో ఏర్పడిందని శాస్త్రవేత్తలు కన్ఫర్మ్‌ చేశారు.అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు కూడా ఈ మేఘాల ఆకారంపై వ్యాఖ్యలు చేయడం జరిగింది.వారు కూడా దీన్ని తేలికగానే కొట్టి పారేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube