Dhoni And Kohli Wants Hike In Annual Salary

భారతీయ క్రికేట్ బోర్డు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికేట్ బోర్డు.ఎటు చూసిన వేల కోట్లకు తగ్గని ఐపియల్ నిర్వహణ కేవలం బిసిసిఐకే సాధ్యపడే విషయం.

 Dhoni And Kohli Wants Hike In Annual Salary-TeluguStop.com

అంతటి బ్రాండ్ వాల్యూ ఉంది‌.అందుకే భారత క్రికేటర్లు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికేటర్లుగా ఉంటూ వస్తున్నారు.

కొహ్లీ సంపాదన ఏడాదికి 200 కోట్లకు పైమాటే‌.ధోని కూడా 100 కోట్లు అవలీలగా దాటేస్తున్నాడు.

ఐపియల్ వలన వచ్చే 5 కోట్లు – 15 కోట్లు క్రాంట్రాక్ట్ లకే ఇతర దేశ ఆటగాళ్ళు తెగ మురిసిపోతుంటారు.కాని ఆ ఐపియల్ కాంట్రాక్టులు మన స్టార్ క్రికేటర్లకు చాలా చిన్న విషయం.

అలాంటి ధోని, కొహ్లీలు జీతాలు సరిపోవడం లేదు అంటున్నారు.ఇదేమి అత్యాశ అనుకోకుండా మ్యాటర్ మొత్తం చదవండి

మన క్రికేటర్లని మూడు గ్రేడుల్లో విభజించారు.

గ్రేడ్ ఏ, గ్రేడ్ బి మరియు గ్రేడ్ సి.గ్రేడ్ ఏ వారికి వార్షిక జీతం 2 కోట్లు కాగా, గ్రేడ్ బి వారికి 1 కోటి మరియు గ్రేడ్ సి వారికి 50 లక్షలు అందుతాయి‌.బిసిసిఐ సంపాదనతో పోల్చుకుంటే ఆటగాళ్లకు ఇచ్చే జీతాలు బావిలోంచి గ్లాసేడు నీళ్ళు తీయడమే.ఐపియల్ బ్రాండ్ వాల్యూ దగ్గర దగ్గర 50 వేల కోట్లు‌.ఒక్క శాటిలైట్ (5 ఏళ్ళకు) 14000 కోట్లకు పైగా రాబట్టిన బోర్డు, అందులోంచి ఐపియల్ టీమ్స్ కి పంచి, పన్నులు చెల్లించగా పోను, 3000 కోట్లు పైగానే వెనకేసుకుంటోంది.టైటిల్ స్పాన్సర్ హక్కులు, టీమ్ ఇండియా జెర్సీ స్పాన్సర్, మ్యాచుల సాటిలైట్ హక్కులు, జెర్సి డిజైనింగ్ హక్కులు, ఇలా చెప్పుకుంటూపోతే ఇంకా చాలా రకాలుగా సంపాదన పొందుతుంది బోర్డు.

ఇంత మొత్తంలో ధోని, కొహ్లీ లాంటి ఏ గ్రేడ్ ప్లేయర్స్ కి ఏడాదికి చెల్లించే జీతం రెండు కోట్లు

ధోని, కొహ్లీ అంటే వ్యాపార ఒప్పందాల ద్వారా బాగా వెనకేసుకుంటారు.మరి మిగితా ఆటగాళ్ళ సంగతి ఏంటి? వారు కూడా దేశానికి ఆడుతున్నారు కదా.వారికి మాత్రం జీతాలు ఎలా సరిపోవాలి.అందుకే ధోని, కొహ్లీ COA తో క్రికేటర్ల జీతాల పెంపుపై మాట్లాడబోతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube