విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఘటనపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వివరణ ఇచ్చారు.ఎంపీ భార్య, కుమారుడుతో పాటు ఆడిటర్ జీవీని హేమంత్, రాజేశ్, సాయి కిడ్నాప్ చేశారని తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే ఛేజ్ చేసి ముగ్గురు కిడ్నాపర్లను పట్టుకున్నామని డీజీపీ వెల్లడించారు.డబ్బుల కోసమే కిడ్నాప్ చేశారన్న ఆయన ఎంపీ ఇంట్లో ఉన్న రూ.15 లక్షలు కిడ్నాపర్లు తీసుకున్నారని పేర్కొన్నారు.మరో రూ.60 లక్షలు బదిలీ చేసి ఆ డబ్బులు కూడా తెప్పించుకున్నారన్నారు.మొత్తంగా కోటి 75 లక్షలు తీసుకున్నారని తెలిపారు.ఇప్పటివరకు రూ.85 లక్షలు రికవరీ చేశామన్నారు.ఈ క్రమంలో పోలీసులు సరిగా పని చేయడం లేదనడం సరికాదని చెప్పారు.లా అండ్ ఆర్డర్ లో ఎటువంటి లోపం లేదని స్పష్టం చేశారు.