Adipurush : ప్రభాస్ ఇంత జరుగుతున్న ఎందుకు ప్రశ్నించలేదు .. దీనికి బాధ్యత ఎవరిది ?

ఆదిపురుష్( Adipurush ) శుక్రవారం రోజు ఎన్నో అంచనాలు మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది.ఇప్పటి వరకు ప్రభాస్ ని ఎలా చూడాలి అని అనుకున్నారో అందుకోసం థియేటర్ కి వెళ్లిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు నిరాశ చెంది కానీ బయటకు రాడు.

 Analysis On Prabhas Adipurush Movie-TeluguStop.com

అస్సలు సినిమా కోసం వందల కోట్ల బడ్జెట్ పెట్టిన నిర్మాతల గురించి కానీ, కెరీర్ పణంగా పెట్టి సినిమాలో నటిస్తున్న ప్రభాస్ గురించి కానీ దర్శకుడు ఓం రౌత్ ఒక్కసారి కూడా ఆలోచించినట్టు కనిపించలేదు.సినిమా ఆసాంతం గ్రాఫిక్స్ కోసం చూడటానికి వెళ్లినట్టు ఉన్నప్పటికి అవి కూడా శాకుంతలం చిత్రం కంటే కూడా నాసిరకంగా ఉండటం తో ప్రేక్షకులు ఉసూరుమంటూ బయటకు వచ్చారు.

Telugu Bollywood, Graphics, Kriti Sanan, Kriti Sanon, Om Raut, Prabhas, Tollywoo

అసలు టీజర్ నుంచే సినిమా పై ఇంత నెగటివ్ టాక్ ఉన్నప్పటికి ప్రభాస్ ఎందుకు సినిమా విషయంలో దర్శకుణ్ణి వార్న్ చేయలేదో అర్ధం కానీ పరిస్థితి.స్వర్ణ లంక ను ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ గా మార్చిన ఘనత కేవలం ఓం రౌత్( Om Raut ) కి మాత్రమే దక్కింది.పైగా ఇదే రామాయణం అనుకోని ఇప్పటి తరం చిన్నారులు భ్రమపడి పరిస్థితి కూడా వచ్చింది.ఇలాంటి ఒక రామాయణం కథకు ప్రభాస్ ని ఎంచుకోవడం దర్శకుడు చేసిన మొదటి అతి పెద్ద తప్పు.

వాంప్ తరహా పాత్రలో నటించిన నయనతార ను కూడా శ్రీరామరాజ్యం లో సీత గా నటిస్తే జనాలు ఒప్పుకున్నారు కానీ కృతి సనన్ ని ఏ మాత్రం సీత గా చూడలేకపోయారు.ఇక లక్ష్మణుడు, హనుమంతుడు పాత్రలను ఎంత తక్కువ విశ్లేషించుకుంటే అంత మంచిది.

Telugu Bollywood, Graphics, Kriti Sanan, Kriti Sanon, Om Raut, Prabhas, Tollywoo

సినిమా ఒక అరిగిపోయిన మెగా సీరియల్ లా ఉంది.పైగా ఆ సీరియల్స్ కూడా చిన్న తనం నుంచి మనం చూస్తూనే ఉన్నాం.ఇప్పటికే కొన్ని వందల సినిమాలు రామాయణం పై తెరకెక్కాయి.అయినా కూడా ఓం రౌత్ ఎందుకో రామాయణం చదవలేదు అలాగే ఆ సినిమాలు కూడా చూడలేదు అని ఆదిపురుష్ చూసాక అనిపిస్తుంది.

సాంగ్స్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేవు.కొంత మేర బీజీఎమ్ ఒకే అనిపించింది.రామాయణంలో ట్విస్టులు కొత్తగా పెట్టాలనుకొని అడ్డంగా జనాలను పిచ్చోళ్లను చేస్తా అంటే ఎలా సామి.ప్రభాస్( Prabhas ) ఇలా దర్శకులకే సినిమాని వదిలేస్తే ఇక రిటైర్మెంట్ గురించి ఆలోచించుకోవాల్సి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube