నందమూరి హీరో కళ్యాణ్ రామ్( Kalyan Ram ) గురించి మనందరికి తెలిసిందే.ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.
ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.కాగా కళ్యాణ్ రామ్ గత ఏడాది బింబిసార సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
గత ఏడాది విడుదలైన బింబిసార సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.
ఇకపోతే కళ్యాణ్ రామ్ ప్రస్తుతం డెవిల్ సినిమా( Devil movie )లో నటిస్తున్న విషయం తెలిసిందే.
కళ్యాణ్ రామ్ తన ఆశలన్నీ కూడా ఈ సినిమా పైనే పెట్టుకున్నారు.ఈ సినిమాతో సక్సెస్ ని అందుకొని మళ్ళీ ట్రాక్ లోకి రావాలని భావిస్తున్నారు కళ్యాణ్ రామ్.అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళిన కొంతకాలానికి వరుసగా వివాదాలు ఒకదాని తర్వాత ఒకటి వెంటాడుతూనే ఉన్నాయి.
పోస్టర్‌లో ఉన్న దర్శకుడి పేరును టీమ్ తొలగించడంతో సినిమా వివాదంలో పడిన సంగతి అందరికి తెలిసిందే.ఈ వివాదంపై ఇప్పటివరకు ఒక కొలిక్కి రాకపోగా అది మరో స్థాయికి చేరుకుంది.
మొదట నవీన్ మేడారం దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది.కానీ మేకింగ్ విషయంలో కొన్ని విభేదాల కారణంగా చిత్ర బృందం అతని పేరును తొలగించింది.
అంతే కాకుండా చిత్ర నిర్మాత అభిషేక్ నామా( Abhishek Nama ) చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు క్రెడిట్‌ను తీసుకున్నట్లు తెలియడంతో అందరు ఆశ్చర్యపోయారు.
అయితే ఆ వివాదం విషయంలో దర్శకుడు హార్ట్ అయ్యి సోషల్ మీడియాలో ఇన్ డైరెక్ట్ గా పోస్ట్ కూడా పెట్టడం జరిగింది.దానిపై ఎవరూ కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు.అయితే చివరికి హీరో కళ్యాణ్ రామ్ కూడా ఆ విషయంలో మౌనంగా ఉండడంతో ఎందుకు అలా ఉన్నాడు అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు.
ఎంతకీ గొడవ ఒక కొలిక్కి రాకపోవడంతో బాధపడ్డ దర్శకుడు నవీన్(Naveen ) తన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు.అయితే ఇవన్నీ చాలవన్నట్లు ఇంతలోనే మరొక సమస్య వచ్చి పడింది.
థియేట్రికల్ బిజినెస్ విషయంలో నిర్మాతకు ఇబ్బంది పడుతున్నట్లు టాక్ వస్తోంది.సినిమా షూటింగ్ ఇంకా ముగియాల్సి ఉంది.
కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.ఈ సమయానికి, థియేట్రికల్ బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ అవ్వాలి, కానీ వివాదం కారణంగా సినిమా చుట్టూ ఉన్న పేలవమైన బజ్ సినిమాకు అడ్డంకిగా మిగిలిపోయింది.
దీంతో సినిమాపై పెట్టుబడులు పెట్టేందుకు డిస్ట్రిబ్యూటర్స్ వెనుకడుగు వేస్తున్నారు.