దేవత సీరియల్ నటి వైష్ణవి పెళ్లి.. అతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటి వైష్ణవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు ఏర్పరుచుకుంది వైష్ణవి.

 Devatha Serial Actress Vaishnavi Marriage Videos Goes Viral In Youtube , Devatha-TeluguStop.com

స్టార్ మా లో ప్రసారం అవుతున్న దేవత సీరియల్ తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది.ఇదిలా ఉంటే తాజాగా వైష్ణవి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

అయితే వైష్ణవి తన పెళ్ళికి ముందు నుంచే తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా వరుస వీడియోలను చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే.అలా నిశ్చితార్ధం మొదలుకొని ఐదురోజుల పెళ్లి వరకూ ప్రతి వీడియోను కూడా తన యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేయడంతో వైష్ణవి ఇప్పుడు యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.

ఆమె పెళ్లికి సంబంధించిన ప్రతి వీడియో మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టడంతో వైష్ణవి ట్రెండింగ్ నెంబర్ 1గా నిలిచింది.గత నెల 25 వ తేదీన శంషాబాద్‌లో వైష్ణవి వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

కరీంనగర్‌కి చెందిన సురేష్ కుమార్‌తో ఈమె పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.ఈ పెళ్లి వేడుకకు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.వైష్ణవి, సురేష్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉండగా.పెద్దల్ని ఒప్పించి మరి పెళ్లి పీటలు ఎక్కారు.

ఇదిలా ఉంటే వైష్ణవి భర్త సురేష్ ఎవరు అన్నది చాలా మందికి తెలియదు.మరి ఆ సురేష్ ఎవరో కాదు స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ డైరెక్టర్.

ఇద్దరూ ఇండస్ట్రీకి చెందిన వారే కావడంతో ఈ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారి ఇలా పెళ్లి పీటలు కూడా ఎక్కింది.ఇక ఆంటీ వైష్ణవి విషయానికి వస్తే దేవత సీరియల్ లో మొదట సత్య పాత్రలో టీవీ నటించినప్పటికీ ఆ తరువాత ప్రస్తుతం ఈమె ప్లేస్ లో కన్నడ నటి అయిన మాన్సి జోషి నటిస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం వైష్ణవి సీరియల్స్‌కి దూరంగా ఉంటూ పర్సనల్ లైఫ్‌తో బిజీ బిజీగా ఉంది.అయితే సీరియల్స్ నుంచి గ్యాప్ వచ్చిన తరువాత యూట్యూబ్‌లో ఫుల్ బిజీ అయిపోతుంది.

ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను యూట్యూబ్‌లో షేర్ చేస్తూ మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతూ ట్రెండింగ్‌‌లో ఉంటుంది వైష్ణవి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube