ఇటీవలి సంవత్సరాలలో చాలా మంది భారతీయ పర్యాటకులు స్కెంజెన్ వీసా( Schengen visa ) తిరస్కరణలను ఎదుర్కొన్నారు.2022లో, అల్జీరియా తర్వాత అత్యధిక సంఖ్యలో తిరస్కరణలను మన భారతదేశమే కలిగి ఉంది.మయాంక్ శర్మ ( Mayank Sharma )అనే బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ ఈ విషయాన్ని ప్రత్యక్షంగా అనుభవించాడు.ఢిల్లీకి చెందిన ఈయన స్కెంజెన్ వీసా ఫ్లైట్ డేట్ కు కేవలం రెండు రోజుల ముందు రిజెక్ట్ అయింది.
ఆయన గ్రీస్‌లో ఏడు రోజుల వెకేషన్ ప్లాన్ చేశారు.హోటల్, ఫ్లైట్ టికెట్లకు పెట్టిన ఖర్చు వృథా అయిపోయింది.దీనివల్ల ఆయనకు రూ.3.5 లక్షల నష్టం కలిగింది.తగినంత నిధుల రుజువు ఉన్నప్పటికీ, అతను తిరిగి రాలేడని రాయబార కార్యాలయం నిర్ధారించింది.
కొంతమంది ప్రయాణికులు స్కెంజెన్ వీసా తిరస్కరణను “యూరోపియన్ వీసా అధికారులచే నేరపూరిత ప్రవర్తన”గా అభివర్ణించారు.ఏప్రిల్ నుంచి జూన్ వరకు స్కెంజెన్ వీసా దరఖాస్తులలో పెరుగుదల కనిపిస్తుంది, ఇది అధిక తిరస్కరణ రేట్లకు దారి తీస్తుంది.
ఈ కాలంలో EU రాయబార కార్యాలయాలు పెరిగిన పనిభారాన్ని ఎదుర్కొంటాయి.
అయితే వీసా రిజెక్షన్ వల్ల నష్టాలు కలగకుండా ఎల్లప్పుడూ విమానాలు, వసతి కోసం 100% వాపసు అందించే ప్రయాణ బీమాను ఎంచుకోవాలి.ఈ విధంగా, స్కెంజెన్ వీసా చివరి క్షణంలో తిరస్కరించబడితే, మీరు డబ్బును కోల్పోరు.విదేశీ ప్రయాణాన్ని ప్లాన్ చేస్తున్నప్పుడు, రీఫండబుల్ బుకింగ్స్‌ను ఎంచుకోవాలి.వీసా సమస్యలు లేదా చివరి నిమిషంలో ఏవైనా మార్పులు జరిగినా ఆర్థిక నష్టాలు రాకుండా ఇది నిర్ధారిస్తుంది.
సాధారణ పాస్‌పోర్ట్‌తో 12 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయ పౌరులకు, స్కెంజెన్ వీసా దరఖాస్తు రుసుము €80 లేదా రూ.7,000.సాధారణంగా, స్కెంజెన్ వీసా ప్రాసెస్ చేయడానికి దాదాపు 15 రోజులు పడుతుంది.
ఈ ప్రత్యేక వీసా 180 రోజుల వ్యవధిలో గరిష్టంగా 90 రోజులు స్కెంజెన్ ప్రాంతంలో ఉండడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.