ప్రధాని మోదీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు.రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

గత కొన్నేళ్లుగా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని కేజ్రీవాల్ తెలిపారు.బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చివేయడం, విచ్ఛిన్నం చేయడం, దేశ సహకార సమాఖ్య వాదం కాదని ఆయన లేఖలో వెల్లడించారు.

ఎమ్మెల్యేలు అమ్ముడు పోకుండా ప్రభుత్వం విచ్ఛిన్నం కాకపోతే గవర్నర్ ద్వారా పాలనను అడ్డుకునేందుకు ఆర్డినెన్స్ తెచ్చారన్నారు.ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎందుకు స్తంభింప చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు.

ఇదేనా భారతదేశ విజన్ .? ఇది కోఆపరేటివ్ ఫెడరలిజమా అని నిలదీశారు.సహకార సమాఖ్యవాదం ఒక జోక్ గా మిగిలిపోతుందన్న కేజ్రీవాల్ అందుకే రేపటి నీతి ఆయోగ్ భేటీకి హాజరు కావడం లేదని స్పష్టం చేశారు.

Advertisement
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తాజా వార్తలు