ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు ఇండియా అంటే చాలా అభిమానం ఉంది.అందుకే ఆయనెప్పుడూ భారతీయులకు టచ్ లో ఉంటారు.
ఇప్పటికే ఇండియన్ సినిమాలకు సంబంధించిన పాటలు, ఫైట్స్, డైలాగ్స్ చెబుతూ వార్నర్ వీడియోలు చేసి అందరిని అలరించాడు.డేవిడ్ వార్నర్ కు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం.
అందుకే ఆయన మహేశ్ బాబు, అల్లు అర్జున్ సినిమాల్లోని డైలాగ్స్, డాన్స్ మూమెంట్స్ చేస్తూ వీడియోలు చేశాడు.ఆ వీడియోలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
డేవిడ్ వార్నర్ ఆసీస్ క్రికెట్ టీమ్ కు వైస్ కెప్టెన్‌గా, ఐపీఎల్ లో సన్‌రైజర్స్ టీమ్ కు కెప్టెన్‌గా అందర్నీ ఆకట్టుకున్నాడు. బహుబలి ప్రభాస్‌గా కత్తి పట్టాడు.
అలాగే పోకిరి మహేశ్‌లా కర్చీఫ్ చేతికి చుట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.డేవిడ్ వార్నర్ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలతో తెలుగు వారికి ఎంతో దగ్గరైన విషయం అందరికీ తెలిసిందే.
ఆ మధ్యన టిక్ టాక్ వీడియోలు చేసి అందర్నీ ఉర్రూతలూగించాడు.
తెలుగు ప్రజలు డేవిడ్ వార్నర్ ను ఓ గొప్ప క్రికెటర్ గానే కాకుండా టిక్ టాక్ స్టార్ లాగానే చాలా మందికి తెలుసు.వార్నర్ టిక్ టాక్‌లో చాలానే తెలుగు వీడియోలను చేసి అందర్నీ ఆకర్షించాడు.తన వీడియోలల్లో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా ప్రీ క్లైమాక్స్‌లో చెప్పిన గెటౌవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్ అనేటటువంటి డైలాగు తనకెంతో ఇష్టమని, అది తనకు బెస్ట్ డైలాగ్ అంటూ తన ఇష్టాన్ని పంచుకున్నాడు.
దీంతో మరోసారి అతను పెట్టిన వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.డేవిడ్ వార్నర్ మెగాస్టార్ చిరంజీవి వీడియోలు మాత్రమే కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వీడియోలను కూడా చేశాడు.
వినయ విధేయ రామ చిత్రంలో రామ్ చరణ్ చెప్పిన మాస్ డైలాగ్ చెప్పి మెగా అభిమానులకు దగ్గరయ్యాడు.ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.