బాలుడికి ముద్దుపై దలైలామా స్పందన.. క్షమాపణ చెప్పి వివాదానికి ఫుల్‌స్టాప్

ప్రముఖ బౌధ మత గురువు దలైలామా ఓ బాలుడికి ముద్దు పెట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.బాలుడి పెదాలపై ముద్దు పెట్టడంతో పాటు తన నాలుకను ముద్దు పెట్టుకోవాలని ఆ బాలుడిని ఆయన కోరాడు.

 Dalai Lama's Reaction To The Boy's Kiss Full Stop To The Controversy By Apologiz-TeluguStop.com

దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధ గురువుగా పేరొందిన ఆయన ఇలాంటి పనులు చేయడమేంటని ప్రశ్నించారు.

దీనిపై వివాదం రేకెత్తింది.దీంతో దలైలామా( Dalai Lama ) ఆఫీసు నుంచి తాజాగా ప్రకటన వెలువడింది.

దీంతో పాటు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయంపై ఆయన క్షమాపణలు కోరారు.బాలుడితో పాటు అతడి కుటుంబం బాద పడుతుంటే వారికి క్షమాపణలు అని పేర్కొన్నారు.

Telugu Controversy, Dalai Lamas, Full, Long Dharma-Latest News - Telugu

దలైలామా చేసే వ్యాఖ్యలు, పనులు కొన్ని తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్నాయి.ఆ వైరల్ వీడియోలో మైనర్ బాలుడిని పెదాలపై ముద్దు పెట్టుకోవడం, తన నాలుకను చప్పరించాలని అతడిని అడగడం నెటిజన్లకు జుగుప్స కలిగించింది.అభం శుభం తెలియని బాలుడితో ఇలాంటి పనులేంటని నెటిజన్లు నిలదీశారు.ఇది లైంగిక వేధింపుల క్రిందికి వస్తుందని, దలైలామాను అరెస్ట్ చేయాలని కొందరు డిమాండ్ చేశారు.దీనిపై వివాదం పెరుగుతుండడంతో ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పారు.దలైలామా విమర్శలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు.

Telugu Controversy, Dalai Lamas, Full, Long Dharma-Latest News - Telugu

కొన్ని సంవత్సరాల క్రితం బీబీసీకి( BBC ) ఇచ్చి ఇంటర్వ్యూలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.తన వారసుడు ఒక మహిళ అయి ఉండాలని, అంతేకాకుండా ఆమె అత్యంత ఆకర్షణీయంగా ఉండాలని చెప్పాడు.దీనిపై విమర్శలు రావడంతో ఆయన క్షమాపణ చెప్పవలసి వచ్చింది.మరో వైపు పిల్లలకు ముద్దు పెట్టే ఆచారం టిబెట్ సంస్కృతిలో భాగమని కొందరు చెబుతున్నారు.9వ శతాబ్దం నుండి అది కొనసాగుతోందని వివరిస్తున్నారు.లాంగ్ డార్మా ( Long dharma )అనే పేరున్న రాజుకు నల్లటి నాలుక ఉండేది.

ప్రజలు ఈ రాజును అస్సలు ఇష్టపడలేదు.టిబెట్ ప్రజలు రాజు పునర్జన్మ పొందారని నమ్ముతారు.

కాబట్టి దీనిని నిరూపించడానికి ఆ ఆచారం కొనసాగిస్తున్నట్లు కొందరు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube