తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ హీరో దగ్గుబాటి రానా, మిహిక బజాజ్ ల గురించి మనందరికీ తెలిసిందే.టాలీవుడ్ ఉన్న ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు.
హీరో రానా( Hero Rana ) ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.కాగా రానా చివరగా రానా నాయుడు( Rana Naidu ) వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఇకపోతే రానా మిహిక లు కరోనా మహమ్మారి సమయంలో అనగా 2020 ఆగస్టు 8న మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
ఇక పెళ్లయి దాదాపు మూడేళ్లు దాటిపోయిన కూడా ఈ జంట ఇంకా శుభవార్త చెప్పకపోవడంతో తరచూ ఈ జంటను శుభవార్త ఎప్పుడు చెబుతారు అంటూ అభిమానులు ప్రశ్నిస్తూనే ఉంటారు.
ఆ ప్రశ్నలతో విసిగిపోయిన రానా మిహికలు( Rana Miheeka ) సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తామని తెలిపారు.ఇది ఇలా ఉంటే రానా సినిమాలకు సంబంధించిన విషయాలలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
మిహికా( Miheeka ) కూడా తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకూ తన భర్తకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.నెట్టింట పోస్టులు పెడుతూ అభిమానులకు చేరువగా ఉంటుంది.
విదేశాల్లో వేకేషన్‌కు వెళ్లిన సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటూ తన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.పాండాలను( Panda ) నిజ జీవితంతో పోలుస్తూ ఫోటోలను పంచుకుంది.తన పోస్ట్ లో ఈ విధంగా రాసుకొచ్చింది మిహిక నా గురించి తెలిసిన వారు ఎవరైనా పాండాల పట్ల నాకున్న ప్రేమను అర్ధం చేసుకుంటారు.
అవి కేవలం జంతువులు మాత్రమే కాదు.అవి స్వచ్ఛమైన ఆనందం, క్యూట్‌నెస్, సరదాతనం, ఉల్లాసంతో నిండి ఉన్నాయి.
మన కడుపులో బిడ్డ ఎలాగైతే మనల్ని తన్నడాన్ని ఆనందిస్తామో? అలాంటి పరిపూర్ణమైన స్వరూపాన్ని వాటిలో చూస్తున్నాను.అయితే నా జీవితంలో ఆ రోజు వచ్చినప్పుడు నేను నిజమైన పాండాగా మారిపోతాను.ఇలాంటి ఫీలింగ్ కేవలం అద్భుతం మాత్రమే కాదు.నా జీవితంలో ఓ కల నిజమైనట్లే.అంతే కాకుండా నా జీవితంలో అత్యంత సంతోషకరమైన మరపురాని రోజు కూడా అదే అవుతుంది అని రాసుకొచ్చింది మిహిక. ప్రస్తుతం అందుకు సంబందించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.