అనంతపురం జిల్లాలో సైబర్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.ఈ క్రమంలో సైబర్ కేటుగాళ్లు అమాయకులను టార్గెట్ గా చేసుకుని దోచుకున్నట్లు తెలుస్తోంది.
రెండు రోజుల్లో 15 మంది ఖాతాల నుంచి డబ్బులు కాజేసినట్లు గుర్తించారు.ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల నుంచి ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు.