ఈ సీరియల్ నెం. కరెన్సీ నోటు మీ దగ్గరుందా? అయితే రూ. 3లక్షలు మీ సొంతం?

ఎవరి పిచ్చి వారిదన్నట్టు, అలాంటి పిచ్చిని క్యాష్ చేసుకొనేవారు అనేకమంది వున్నారు.అయితే అదే పిచ్చికి కాస్త ఎమోషన్ తోడైతే మాత్రం ఇక అవతల వారికి కాసులు వర్షం కురిసినట్టే.అవును… ఇపుడు కధనం చదివితే మీకు ఆ విషయం బోధ పడుతుంది.మనలో కొంతమందికి పాతవస్తువులు సేకరించడం ఓ హాబీగా ఉంటుంది.

 Currency Notes With 786 Serial Number Can Fetch Three Lakh Rupees,currency Notes-TeluguStop.com

అందులో కొంతమంది కాయిన్స్, పాత నోట్లను సేకరిస్తూ వుంటారు.అంతేకాకుండా అలాంటివాటి కోసం వారు ఎంతైనా వెచ్చించి మరీ సొంతం చేసుకుంటారు.

ఈ క్రమంలో కొంతమంది ఓ సంఖ్య వున్న పాత, కొత్త నోట్లను సేకరించడమే పనిగా పెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్ర‌స్తుతం ఆన్‌లైన్ సెల్లింగ్ సైట్ల‌లో ఒక సీరియ‌ల్ సంఖ్యకి చాలా డిమాండ్ ఏర్పడింది.

మీ ద‌గ్గ‌ర ఉన్న క‌రెన్సీ నోట్ల‌పైన ఈ సంఖ్య ఉంటే మాత్రం మీ జేబులో లక్షల రూపాయలు ప‌డ్డ‌ట్లే మరి.ప్రస్తుతం కొంతమంది కరెన్సీ నోట్లపై సీరియల్ నంబర్‌లో ఉన్న‌ ‘786’ సంఖ్య కోసం వెదుకుతున్నారు.ఈ నిర్దిష్ట క్రమంలో కనిపించే ఈ మూడు అంకెలు నోటుతో దాదాపు రూ.3 లక్షల వ‌ర‌కూ సంపాదించే అవ‌కాశం ఉంది.ఎందుకంటే, ఇస్లాం అనుస‌రించే వారిలో 786 సంఖ్య శుభప్రదంగా భావిస్తారు.కనుక‌, ఈ సీరియ‌ల్‌తో ఉన్న నోటు దొరికితే దాన్ని ఆన్‌లైన్‌లో వేలం వేయ‌డం వ‌ల్ల దాని విలువ ఎంతైనా పెర‌గొచ్చు.

ప్ర‌స్తుతం, eBay లాంటి కొన్ని రకాల ఇ-కామర్స్ వెబ్‌సైట్‌ల‌లో ఇతర ఉత్ప‌త్తుల‌తో పాటు, ఇలాంటి ప్రత్యేకమైన కరెన్సీ నోట్లు, నాణేలను అమ్మ‌డానికి, కొనుగోలు చేయడానికి అనుమ‌తులు ఉన్నాయి.వీటికోసం ఇతర ప్లాట్‌ఫారమ్‌లు కూడా అనేకం వున్నాయి.

ఇక కొందరు ఇలాంటి అరుదైన నోట్ల‌ను సోషల్ మీడియాలో కూడా అమ్ముతుంటారు.అయితే సరియైన పద్ధతుల ద్వారా వెళ్లకపోతే ఇందులో మోసపోయే అవకాశం కూడా లేకపోలేదు.

అందుకనే జెన్యూన్ సైట్స్ ద్వారా మాత్రమే ఇలాంటి లావాదేవీలు జరపడం ఉత్తమం.అందుకే ఇలాంటివి చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం ఉత్తమం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube