నిజ్జర్ హత్య వెనుక భారత్.. మా దగ్గర కీలక సాక్ష్యం: కెనడియన్ సిక్కు ఎంపీ జగ్మీత్ సింగ్

ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత్ హస్తం వుండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canada PM Justin Trudeau ) చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.ఈ వ్యాఖ్యలు భారత్, కెనడా సంబంధాలను తీవ్రంగా దెబ్బతీశాయి.

 Credible Evidence Of Indias Involvement In Killing Of Sikh Separatist Says Canad-TeluguStop.com

భారత్‌కు వ్యతిరేకంగా మద్ధతు కూడగట్టాలని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.మరోవైపు ట్రూడో వ్యాఖ్యలతో కెనడాలోని సిక్కు గ్రూపులు ఆందోళనలు ముమ్మరం చేశాయి.

భారత దౌత్య కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ, ఎన్డీపీ నేత జగ్మీత్ సింగ్( Canadian MP Jagmeet Singh ) కీలక వ్యాఖ్యలు చేశారు.

నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం వున్నట్లు విశ్వసనీయ ఆధారాలు వున్నాయని ట్రూడో ప్రభుత్వంలో భాగస్వామి అయిన జగ్మీత్ అన్నారు.ఈ విషయంలో కెనడియన్ నిఘా వర్గాల నుంచి సమాచారం వుందని ఆయన మంగళవారం ఒట్టావాలో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు.

Telugu Canada, Canadapm, Canadianmp, Hardeepsingh, India, Jagmeet Singh, Khalist

జస్టిన్ ట్రూడో భారత్‌పై చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైన విషయంగా అభివర్ణించిన జగ్మీత్ సింగ్.తనకు అందిన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఈ అభిప్రాయాలు తెలిపినట్లు చెప్పారు.అందుకే ఈ విషయంపై కెనడా ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలని తాము కోరుతున్నామని, తద్వారా బాధ్యులను బయటకు తీసుకురావాలని జగ్మీత్ సింగ్ స్పష్టం చేశారు.పారదర్శకమైన దర్యాప్తుకు భారతదేశం( India ) సహకరించాలని అమెరికా ( America ) చేసిన విజ్ఞప్తిపైనా ఆయన స్పందించారు.

దీనిపై తాము మరింత ఒత్తిడిని కొనసాగిస్తామన్నారు.జగ్మీత్ సింగ్ సారథ్యంలోని న్యూడెమోక్రటిక్ పార్టీ కెనడియన్ పార్లమెంట్‌లోని దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో నాల్గవ అతిపెద్ద పార్టీ అన్న సంగతి తెలిసిందే.

Telugu Canada, Canadapm, Canadianmp, Hardeepsingh, India, Jagmeet Singh, Khalist

ఇదిలావుండగా నిజ్జర్ హత్య విషయంగా అమెరికా స్వరం మారుతున్నట్లుగా కనిపిస్తోంది.కెనడాకు మద్ధతుగా అగ్రరాజ్యం మాట్లాడటం మొదలెట్టింది.నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో సహకరించాలని భారత్‌ను కోరినట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్( Matthew Miller ) తెలిపారు.ఈ ఘటనలో దోషులకు శిక్షపడాలని ఆయన అభిప్రాయపడ్డారు.

కాలిఫోర్నియా ప్రతినిధుల సభ సభ్యుడు జిమ్ కోస్టా మాట్లాడుతూ.నిజ్జర్ హత్యపై తాను చాలా ఆందోళన చెందానని తెలిపారు.

ఈ నేరానికి సంబంధించి దోషులను గుర్తించాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube