కరోనా చివరికి వారిని కూడా వదలలేదు!

కరోనా కట్టడి కోసం ఎప్పటికప్పుడు ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేసి పలు సూచనలు చేసే ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) ను కూడా కరోనా వదలలేదు.ఈ రీసెర్చ్ సెంటర్ పని చేస్తున్న ఒక సీనియర్ సైంటిస్ట్ కు కరోనా పాజిటివ్ అని తేలడం కలకలం రేపింది.

 Icmr Scientist Test Positive For Covid-19, Coronavirus, Lock Down, Home Quaran-TeluguStop.com

రీసెర్చ్ సెంటర్ లో పని చేస్తున్న ఓ సీనియర్ సైంటిస్ట్ ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లారు.అయితే ఆయనకు ఆదివారం పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ ఉన్న విషయం బయటపడింది.

దీంతో మొత్తం ఐసీఎంఆర్ బిల్డింగ్‌ను శానిటైజ్ చేసి, మిగితా సైంటిస్టులను కూడా అప్రమత్తం చేసినట్లు తెలుస్తుంది.

అయితే ప్రజలకు మార్గదర్శకాలను అందించే ఐసీఎంఆర్ సైంటిస్టుకు కూడా కరోనా సోకడంతో ఒక్కసారిగా కలవరం మొదలైంది.

ముంబైలోని సైంటిస్ట్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ రీప్రొడక్టివ్ హెల్త్‌లో అతడు విధులు నిర్వహిస్తున్నాడు.ఇటీవలే ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్నారు.గత వారం జరిగిన ఓ సమావేశంలో కూడా ఆయన పాల్గొనగా,దానికి ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బలరాం భార్గవ కూడా హాజరయ్యారని తెలుస్తుంది.దీంతో ఉద్యోగులందరిని అప్రమత్తం చేసి,బిల్డింగ్ మొత్తాన్ని కూడా శానిటైజ్ చేసినట్లు సమాచారం.

అవసరమనుకుంటే తప్ప ఎవరూ కూడా ఆఫీసుకు రావద్దని ఇళ్ల నుంచే పని చేయాలని సూచించినట్లు తెలుస్తుంది.దీనితో ఐసీఎంఆర్ స్టాఫ్ అంతా కూడా హోం క్వారంటైన్ లో ఉన్నారు.

అయితే కరోనా కోర్ టీమ్ మాత్రం ఎప్పటిలాగే ఆఫీస్ కు రావాలని ఉన్నతాధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube