కరోనా ఎఫెక్ట్.. గణనీయంగా తగ్గుముఖం పడుతున్న తిరుమల శ్రీవారి భక్తులు.. !

ఎప్పుడు భక్తులతో నిత్యశోభయామానంగా వెలుగుతున్న తిరుమల ప్రస్తుతం కరోనా కారణంగా వెలవెలబోతుందట.ఇప్పటికే ఇక్కడ కోవిడ్ కేసుల ఉదృతి తీవ్రస్దాయిలో ఉండగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నింబంధనల వల్ల భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందని సమాచారం.

 Corona Effect On Tirupati Temple Decreased Number Of Devotees Corona Effect, Tir-TeluguStop.com

మనుషుల ప్రాణాలను ఆలోచించకుండా తీసుకుంటున్న ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల తిరుమల శ్రీవారి ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు కూడా భయపడుతుండటంతో వీరి సంఖ్య ఊహించని విధంగా తగ్గుముఖం పడుతుందట.

ఇక కరోనాకు ముందు రికార్డు స్థాయిలో సుమారుగా శ్రీవారిని లక్షా ఐదు వేల మంది భక్తులు దర్శించు కున్నారు.

కానీ నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సంఖ్య 5,081 గా ఉందట.అలాగే నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 39 లక్షలు రాగా 10 వేల ప్రసాదాల విక్రయం మాత్రమే జరిగిందని, 2,104 మంది భక్తులు తలనీలాలు సమర్పించారట.

ఇక ఉచిత భోజనాలకైతే పది వేల భక్తులు కూడా రావడం గగనంగా మారిందట.మొత్తానికి భక్తి కంటే భయమే ప్రజల్లో ఎక్కువగా నెలకొందని ఈ ఘటన వివరిస్తుంది.

అంతేగా బ్రతికి ఉంటే ఎప్పుడైనా శ్రీవారిని దర్శించుకోవచ్చూ మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube