విశ్వక్ సేన్ పాగల్ కూడా ఒటీటీ బాటలోనేనా

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ గా థియేటర్స్ అన్ని బంద్ అయిపోయాయి.

ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ కరోనా మళ్ళీ నార్మల్ అవ్వడానికి చాలా సమయం పట్టేలా ఉంది.

అంత వరకు థియేటర్స్ ఓపెన్ చేసే అవకాశం అయితే ఉండదు.ఓ నాలుగు నెలల పాటు థియేటర్స్ లో సినిమా ప్రదర్శించే అవకాశం లేనట్లే కనిపిస్తుంది.

తరువాత కూడా మునుపటి స్థాయిలో థియేటర్స్ కి ప్రేక్షకులు వస్తారా అనేది సందేహమే.ఎందుకంటే కరోనా మొదటి సారి వచ్చినప్పటి కంటే సెకండ్ వేవ్ ప్రజలని విపరీతంగా భయపెడుతుంది.

దీంతో కచ్చితంగా భౌతిక దూరం పాటించాలనే నిబంధనలకి లోబడి సినిమా చూడటానికి థియేటర్స్ కి వెళ్ళడానికి అంతగా మొగ్గు చూపించకపోవచ్చు.ఈ విషయాన్ని ముందే గ్రహిస్తున్న చాలా మంది నిర్మాతలు తమ సినిమాలని ఒటీటీకి అమ్మేస్తున్నారు.

Advertisement

ఒటీటీ ఛానల్స్ నుంచి కూడా భారీగా ఆఫర్స్ వస్తూ ఉండటంతో నిర్మాతలు థియేటర్స్ ఒపెన్ చేసి అక్కడ తమ సినిమాని రిలీజ్ చేసేంత వరకు వెయిట్ చేసే ఓపిక లేక వెంటనే ఇచ్చేస్తున్నారు.ఎక్కడైనా తమ సినిమా ప్రేక్షకులకి రీచ్ కావడమే ముఖ్యం అనుకొని దర్శకులు కూడా ఆ దిశగానే మొగ్గు చూపిస్తున్నారు.

ఈ నేపధ్యంలో చాలా సినిమాలు ఇప్పటికే ఒటీటీ బాట పట్టేశాయి.ఇప్పుడు యంగ్ హీరో విశ్వక్ సేన్ కొత్త సినిమా పాగల్ కూడా ఒటీటీ బాటలోనే వెళ్తున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమాకి మంచి ఆఫర్ రావడంతో నిర్మాత ఒటీటీ రిలీజ్ కి మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం.త్వరలో ఈ విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు