జయసుధకు కాంగ్రెసు పనిష్మెంట్‌....!

కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే జయసుధకు శిక్ష విధించాలనుకుంటోందా? శిక్ష అంటే షోకాజ్‌ నోటీసు ఇవ్వడం, పార్టీ నుంచి తీసేయడం వగైరా అన్నమాట.కాంగ్రెసు పార్టీ నాయకత్వానికి జయసుధ మీద ఎందుకు కోపం వచ్చింది? ఎందుకంటే…జయసుధ చాలాకాలంగా అంటే ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉన్నారు.పార్టీ నిర్వహించే ఏ కార్యక్రమంలోనూ ఆమె పాల్గొనడంలేదు.కాంగ్రెసు పార్టీ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీద, టీఆర్‌ఎస్‌ మీద నిప్పులు చెరుగుతున్నా ఈ నటీమణీ గొంతు కలపడంలేదు.

 Congress To Take Action Against Jayasudha?-TeluguStop.com

అంటీముట్టనట్లుగా ఉంటోంది.తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది.

ఇదిలా ఉంటే తన కుమారుడు నటించిన ‘బస్తీ’ సినిమా ఆడియో వేడుకకు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించింది.ఇది కాంగ్రెసు పార్టీ నాయకులకు పుండు మీద కారం చల్లినట్లుగా ఉంది.

కాంగ్రెసు పార్టీని వదిలిపెట్టాలనే ఆలోచన కూడా చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు.కాంగ్రెసు పార్టీకి ఆమె సికింద్రాబాద్‌ ఇన్‌చార్జిగా కూడా ఉన్నారు.

ఇన్‌చార్జే పనిచేయప్పుడు కార్యకర్తలు ఎందుకు పనిచేస్తారు? జయసుధ వల్ల పార్టీకి ఏమాత్రం ఉపయోగం లేదని నాయకత్వం భావిస్తోంది.అందుకే ఆమెపై చర్యలు తీసుకోవాలని హైకమాండ్‌ను కోరారట…! జయసుధ టీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నట్లు చాలాకాలం క్రితమే వార్తలు వచ్చాయి.

ఒకవేళ కాంగ్రెసు నుంచి వెళ్లిపోతే టీఆర్‌ఎస్‌లో చేరుతుందేమో….!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube