కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కామారెడ్డిలో కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ఓడిస్తారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 75 నుంచి 80 సీట్లు వరకు గెలుస్తుందని చెప్పారు.ఈ క్రమంలోనే ఎన్నికల నోటిఫికేషన్ ముందు సంక్షేమ పథకాలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేస్తామని తెలిపారు.