ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిపై విమర్శలు సహజమే.అయితే అదేదో ప్రజల గురించో, లేక పాలన గురించో విమర్శలు చేస్తే పర్వాలేదు కానీ, అవేమి కాకుండా సరికొత్త విమర్శలు వినబడితేనే ఒకింత వింతగా అనిపిస్తుంది.
విషయం ఏమిటంటే మొదటి నుంచీ తెలంగాణ సెంటిమెంట్, ఉద్యమంపైనే ప్రధానంగా ఆధారపడిన పార్టీ టీఆర్ఎస్.ఎప్పటికప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రగల్చడం, రాజీనామాలతో భావోద్వేగాలు రెచ్చగొట్టడమే వ్యూహంగా రాజకీయంగా ఉనికి చాటుకుంటూ వచ్చింది.
అంతేకాని తమకంటూ ఒక లీడర్షిప్ ని ఏర్పాటు చేసుకుని, బలమైన నాయకులను తయారు చేసుకునే ప్రయత్నమే చెయ్యలేదు ఇప్పటి వరకూ.అయితే అదృష్టమో, లేక అవతలివారి దురదృష్టమో తెలీదు కానీ, రాక రాక అధికారం వచ్చింది.
ఇక దానిని కాపాడుకునే క్రమంలో కేసీఆర్ వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాడు.అందులో బాగంగానే వలసలను ప్రోత్సహించి.
పార్టీ విస్తరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.కేసీఆర్ వ్యూహంతో కుదేలవుతున్న తెలంగాణ పార్టీలు.
గులాబీనేత వైఖరిపై మండిపడుతున్నాయి.అసలే పరాజయ భారంతో కుంగిపోతున్న పార్టీలు.
నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వదలి గులాబీదళంలో చేరడంతో కేసీఆర్ పై నిప్పులు చెరుగుతున్నారు.కేసీఆర్ కు దమ్ముంటే వారిని పార్టీలో చేర్చుకోవడమే కాదు.
వారితో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికల్లో గెలిపించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.తెలంగాణా తెలుగుదేశం ఎప్పటినుంచో ఈ వాదనను వినిపిస్తూ ఉంటే, తాజాగా కొంగ్రెస్ సైతం కేసీఆర్ పై విరుచుకు పడింది.
కాంగ్రెస్ నేత డీకే అరుణ కేసీఆర్ కు దమ్ముంటే.తలసాని రాజీనామా ఆమోదింపజేసి.
ఎన్నికల్లో పోటీ చేయించి గెలిపించుకోవాలని సవాల్ విసురుతున్నారు.అయితే గతంలో వైఎస్ఆర్ సైతం ఆపరేషన్ ఆకర్శ ను అమలు చేయడంలో సక్సెస్ అయ్యాడు.
మరి అప్పుడు మెదపని నోరు కొంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు విప్పడం ఏంటి అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.