పోరాటాల‌పై ప‌క్కా ప్లాన్ వేసిన కాంగ్రెస్‌.. అంతా కేసీఆర్ చుట్టే..

టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రస్తుతం ఉత్సాహంగా పని చేస్తున్నాయి.

ఈ నెల 9న ఇంద్రవెల్లిలో లక్ష మందితో కాంగ్రెస్ పార్టీ ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ సభ నిర్వహించగా, అది ఫుల్ సక్సెస్ అయింది.ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో, కార్యకర్తల్లో నూతనోత్తేజం వచ్చింది.

కాగా, ఈ సభలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నారు.దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ చేయబోయే పోరాటాలపై పక్కా ప్లాన్ చేసింది.

రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్‌తో కోర్ కమిటీ మీటింగ్ జరగ్గా, అందులో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.ఈ నెల 18న నిర్వహించబోయే ఇబ్రహీంపట్న సభ’ను విజయవంతం చేయాలని చెప్పారు.

Advertisement

కాగా, ఒకపార్టీపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లినవారు అనగా కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు చేయాని సూచించారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ పోరాటాల దిశగా సాగాలని దిశానిర్దేశం చేశారు.

ఇక నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలుకుతున్న అధికారులపైన కాంగ్రెస్ పార్టీ పోరాటం ప్రకటించింది.సదరు అధికారులపై ప్రజల నుంచి ఒత్తిడి పెరిగిలే కాంగ్రెస్ పార్టీ పోరు జరపాలని చెప్తున్నారు.

క్షేత్రస్థాయిలో పోరాటాలను కాంగ్రెస్ పార్టీ నేతలు కో ఆర్డినేట్ చేసేవిధంగా చూడాలని నేతలు తెలిపారు.మొత్తంగా కాంగ్రెస్ పార్టీ పోరాటాలపై పక్కా స్కెచ్‌తోనే ముందుకు సాగుతున్నది.అధికార టీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలోకి పెట్టేందుకుగాను కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతోనే ముందుకు సాగుతున్నది.

కాగా కాంగ్రెస్ పార్టీ మళ్లీ పోరాటాల బాట పడితే కచ్చితంగా అధికారం దిశగా అడుగులు వేస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.అయితే, రేవంత్ సీనియర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు