ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని నందమూరి బాలకృష్ణ,( Nandamuri Balakrishna ) నారా లోకేష్ పై( Nara Lokesh ) ఈసీకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు.ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి జగన్ పై( CM Jagan ) ఇష్టానుసారమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు( YCP MLA Malladi Vishnu ) మీడియాతో తెలియజేయడం జరిగింది.బాలకృష్ణ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా.
ఉన్నాయని విమర్శించారు.ముఖ్యమంత్రి జగన్ ఇమేజ్ డామేజ్ చేసేలా.
బాలకృష్ణ మరియు లోకేష్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై ఎన్నారైలు దుష్ప్రచారం చేయటం సరికాదని అన్నారు.
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలయ్య మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ అని.సీపీఎస్ రద్దు అని మద్యపాన నిషేధమని ప్రజలను మోసం చేసిన నయవంచకుడు జగన్ అంటూ.సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
దాదాపు వారం రోజుల నుండి రాయలసీమ ప్రాంతంలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో వైసీపీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ఇదే సమయంలో ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడాలంటే చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.
ఈ ఎన్నికలలో కూటమిని ఆదరించాలని కోరుతున్నారు.ఏపీలో ఎన్నికలకు ఇంకా నెలరోజులు మాత్రమే సమయం ఉంది.
రేపటి నుండి నామినేషన్స్ ప్రక్రియ మొదలుకానుంది.ఈసారి టీడీపీ.
బీజేపీ.జనసేన పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి.
ఈ క్రమంలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.