దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.ఈ క్రమంలో సెన్సెక్స్ 5000( Sensex 5000), నిఫ్టీ 1600 పాయింట్లకు( Nifty 1600 points) పైగా నష్టం వాటిల్లింది.సుమారు రూ.26 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి అయిపోయింది.ఎగ్జిట్ పోల్స్(Exit polls) అంచనాలను చూసి ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడి పెట్టారని తెలుస్తోంది.అయితే ప్రస్తుత ఎన్నికల ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపర్చాయి.అంచనాల ప్రకారం ఫలితాలు లేకపోవడంతో మార్కెట్ లో అమ్మకాల ఒత్తిడి పెరిగిందని సమాచారం.







