కాంగ్రెస్ పార్టీపై సీఎం వైయస్ జగన్ సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల( YS Sharmila ) బాధ్యతలు చేపట్టడం తెలిసిందే.ఈ క్రమంలో ఆమె కాంగ్రెస్( Congress Party ) బలోపేతానికి శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం వరకు యాత్ర చేపట్టడం జరిగింది.

 Cm Ys Jagan Serious Comments On Congress Party Details, Cm Ys Jagan, Congress P-TeluguStop.com

నిన్న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆమె ఈరోజు విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తున్నారు.స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈ సమావేశాలలో తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీలపై షర్మిల సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు.ఆ రెండు పార్టీలు బీజేపీకి భయపడే పార్టీలు అంటూ విమర్శిస్తున్నారు.

ఇదిలా ఉంటే నేడు సీఎం జగన్( CM YS Jagan ) తిరుపతిలో( Tirupati ) తాజ్ హోటల్ లో ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమ్మిట్ లో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీపై సీఎం జగన్ మండిపడ్డారు.రాష్ట్రంలో కాంగ్రెస్ చెత్త రాజకీయాలు చేస్తుందని విమర్శించారు.ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిలనీ నియమించడం పట్ల స్పందించారు.ఆ నాడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించింది.ఇప్పుడు మా కుటుంబాన్ని విభజించి పాలించాలనే కుట్ర చేస్తోంది.

నేను కాంగ్రెస్ కి రాజీనామా చేసినప్పుడు మా చిన్నాన్నను మాకు వ్యతిరేకంగా పని చేయించింది.విభజించి పాలించటం వాళ్ళ నైజం.

ఇలాంటి వాళ్ళకి దేవుడు గట్టిగా గుణపాఠం చెబుతారు అంటూ సీఎం జగన్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube