నేడు హైదరాబాద్ కోకాపేటకు సీఎం కేసీఆర్..!

CM KCR To Hyderabad Kokapet Today..!

హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని కోకాపేటకు ఇవాళ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ అండ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్ మెంట్ కేంద్రానికి ఆయన భూమి పూజ చేయనున్నారు.

 Cm Kcr To Hyderabad Kokapet Today..!-TeluguStop.com

ఢిల్లీలో కేంద్ర కార్యాలయంతో పాటు వివిధ రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలను బీఆర్ఎస్ ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లో అత్యాధునిక సాంకేతిక హంగులతో మరో భారీ భవనాన్ని నిర్మించనుంది.

సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్తుల్లో బిల్డింగ్ ను నిర్మించనున్నారని తెలుస్తోంది.కాగా ఈ కేంద్రం రాజకీయపరమైన అవగాహన కార్యక్రమాలతో పాటు శిక్షణా తరగతుల నిర్వహణ, కార్యకర్తలు, నాయకులకు అవసరమైన సమాచారాన్ని అందించనుంది.

CM KCR To Hyderabad Kokapet Today! - Telugu Bharatbhavan, Brs, Cm Kcr, Hyderabad, Kokapet #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube