పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన ‘బ్రో’( bro ) చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందుతున్న మరో చిత్రం ఓ జీ ఇదే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
పవన్ హరిహర వీరమల్లు( Pawan Harihara Veeramallu ) సినిమా కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఈ సమయం లో పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందుతున్న హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ( Ustad Bhagat Singh ) సినిమా విడుదల తేదీ పై సందిగ్ధం నెలకొంది.
![Telugu Bro, Harish Shankar, Janasena, Pawan Kalyan, Vaarahi Yatra-Movie Telugu Bro, Harish Shankar, Janasena, Pawan Kalyan, Vaarahi Yatra-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/06/pawan-kalyan-movie-ustad-bhagath-singh-release-dateb.jpg)
ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా యొక్క విడుదల తేదీ ఈ మధ్య కాలం లో ఉండే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి.పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బలోపేతం కోసం వారాహి పై యాత్ర కు సిద్ధం అయిన విషయం తెలిసిందే.ఈ నెలలో ప్రారంభం కాబోతున్న మొదటి విడత యాత్ర కొన్ని నెలల పాటు కొనసాగే అవకాశాలున్నాయి.కనుక హరీష్ శంకర్( Harish Shankar ) సినిమా షూటింగ్ ఎప్పటికీ పూర్తవుతుందో తెలియదు.
విడుదల తేదీ విషయం లో ఎప్పటికీ క్లారిటీ వస్తుంది అనేది తెలియదు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.
ఇక కొందరైతే వచ్చే సంవత్సరం జరగబోతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ( AP Assembly Elections )తర్వాత పవన్ కళ్యాణ్ ఆ సినిమా ని పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అదే జరిగితే మైత్రి మూవీ మేకర్స్ వారికి చాలా డ్యామేజ్ తప్పదు అంటూ సినీ మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది.మొత్తానికి పవన్ కళ్యాణ్ కొత్త సినిమాల పరిస్థితి ఏంటో అంటూ ఆసక్తికరంగా చర్చ సాగుతోంది.
పవన్ కళ్యాణ్ ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా మినిమం సీట్ల ను గెలుపొందాలని పట్టుదలతో ఉన్నాడు.ఏం జరుగుతుందో చూడాలి అంటే వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే.