తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కోసం పాలమూరు ముస్తాబైంది.ఇవాళ సీఎం జిల్లాకు వెళ్తున్నారు.
ప్రభుత్వ యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తోంది.సుమారు 400కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
క్రిస్టియన్ పల్లిలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రజ లనుద్దేశించిమాట్లాడనున్నారు.ఈ మేరకు భారీగా జన సమీకరణకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు ఇది వరకే సన్నా హాలు మొదలు పెట్టారు.
సీఎం రాకకు మహబూబ్ నగర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.కేసీఆర్ పార్క్ కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో పట్టణం గులాబీమయంగా మారింది.
సీఎం పర్యటించే ప్రాంతాలతో పాటు రోడ్ల వెంట శుభ్రత పనులను వేగవంతం చేశారు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఆయాచోట్ల బారికెట్లు ఏర్పాటు చేశారు.రాత్రివేళ జిగేల్ మనిపించేలా విద్యుత్తు లైట్లు అమర్చే పనులు కొనసాగుతున్నాయి.
సీఎం కేసీఆర్ ప్రయాణించే ప్రధాన రహదారుల వెంట గులాబీ జెండాలు ఫ్లెక్సీలతో పట్టణ మొత్తం గులాబీమయంగా మారుస్తున్నారు.రోడ్లను ఇప్పటికే మరింత వెడల్పు చేసి పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడంలో అధికారులు తన మొలకలై పనిచేస్తున్నారు.
సీఎం కేసీఆర్ పాలమూరు పర్యటనకు సంబంధించి ఇప్పటికే జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.జిల్లాలోని మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చర్ల మూడు నియోజకవర్గాల నుంచి 60 వేల మంది, ఉమ్మడి జిల్లాలోని మిగతా నియోజక వర్గాల నుంచి 10వేల నుంచి 15 వేల మంది చొప్పన జనసమీకరణ చేపట్టాలని నిర్ణయించారు.
ఈ మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండలాల వారీగా సమన్వయం చేసుకుని జనాలను తరలించాలని ఆయా నేతలకు దిశానిర్దేశం చేశారు.జడ్చర్ల, దేవరకద్ర ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంక టేశ్వర్రెడ్డి సైతం సన్నాహాలు మొదలుపెట్టారు.
అదేవిధంగా సీఎం ప్రసంగాన్ని ప్రజలు వీక్షించేం దుకు వీలుగా పలు ప్రాంతాల్లో భారీ ఎస్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.కెసిఆర్ బర్డ్స్ ఏన్ క్లోజర్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్న పార్కులో పక్షులను చూడటానికి ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వచ్చేలా దీనిని తీర్చిది.ద్దుతామన్నారు.800 రకాల పక్షులను ఒకేచోట ఏర్పాటు చేయడంతో పర్యాటకులను కనువిందు చేయడానికి కృషి చేస్తున్నారు…దేశంలో అతిపెద్దదైన కేసీఆర్ అర్బన్ ఏకో పార్క్ ను తెలంగాణకు ఒక ఐకాన్ గా తీర్చిదిద్దేందుకు మంత్రి ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు.

మహబూబ్ పట్టణ పరిధిలోని పాలకొండలో జిల్లాకే తలమానికంగా నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.ఆ తర్వాత జిల్లా అధికారులతో సమీక్షించనున్నారు.అక్కడి నుంచి రామయ్యబౌళిలో నిర్మించిన శిల్పారామానికి రానున్నారు.ఆర్చిని ప్రారంభించిన అనంతరం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు.ఆ తర్వాత అప్పనప ల్లి శివారులోని కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు లో నూతనంగా ఏర్పాటు చేసిన బర్డ్ ఎన్ క్లోజర్ను ప్రారంభించనున్నారు.అనంతరం క్రిస్టియన్పల్లిలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో బహి రంగసభకు హాజరుకానున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాల స్వరూపం మారింది.

జిల్లాల విభజన తర్వాత అభివృద్ధి మరింత వేగం అందుకుంది.ప్రధానంగా ఉమ్మడి పాలమూరులోని అన్ని జిల్లాలు సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయి.మహబూబ్ నగర్ కొన్ని వేలకోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
కేసీఆర్ ప్రత్యేక విజన్ తోనే ఇది సాధ్యమైందని అన్నారు.తెలంగాణ రాక ముందు ఎలా ఉండేదో.
ఇప్పుడు ఎలా ఉందో గ్రహించవచ్చని అన్నారు.నూతన కలెక్టరేట్, శిల్పారామం, కేసీఆర్ ఎకో పార్క్, పాలమూరుకే మణిహారం లాంటివి.
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సీఎం ప్రారంభించిన తర్వాత 18 నెలల్లో పూర్తి చేసి అన్ని రకాల వైద్య సేవలందిస్తామని అన్నారు.