ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి లెటర్ రాయడం జరిగింది.ఇదే క్రమంలో పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ మరియు రక్షణ శాఖకు కూడా లెటర్లు రాశారు.
విషయంలోకి వెళితే భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి కోసం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యనీ గుర్తించడం జరిగిందని.
దీంతో త్వరితగతిన… సైట్ క్లియరెన్స్ కి అనుమతులు పునరుద్ధరించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది.
గతంలో భోగాపురం ఏర్పాటు విషయంలో విమానయాన శాఖ జారీ చేసిన అనుమతి ముగియడంతో దాన్ని మళ్లీ పునరుద్ధరించాలని జగన్ ప్రధానిని కోరారు.
ఎన్వోసీ లేకపోవటంతో… అప్పట్లో పనులు నిలిచి పోయాయి అని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో ఈ విషయంలో ప్రైవేటు భాగస్వామిని ప్రభుత్వం గుర్తించడంతో వెంటనే భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి.
పనుల విషయంలో కేంద్రం సహకరించాలని.పూర్తి చేయాలని.
దానికి అనుమతులు వేగంగా మంజూరు చేయాలని.ప్రధాని మోడీ మరియు పౌర విమానయాన మంత్రిత్వ శాఖలకు లెటర్లు రాసి విజ్ఞప్తి చేశారు.