నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు -సీఎం జగన్

రాష్ట్రంలో పారిశ్రామిక విధానంలోని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు.వరుస పారిశ్రామిక ప్రమాదాలపై తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

 Ap, Cm Jagan, Industrial Accidents, Cm Jagan Review, Industrial Department, Indu-TeluguStop.com

ఈ సమావేశంలో పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ ప్రసాద్, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.పరిశ్రమల్లో భద్రత, ప్రమాదాలు, కాలుష్య నివారణ అంశాలపై చర్చించారు.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టామని.వచ్చే మూడు నెలల్లో తనిఖీలను పూర్తి చేస్తామని సీఎం జగన్ కు అధికారులు వెల్లడించారు.

ప్రమాదాల నివారణకు ఇండస్ట్రీయల్ సేఫ్టీ పాలసీని అధికారులు ప్రతిపాదించారు.పరిశ్రమల భద్రత కోసం ప్రస్తుతమున్న రెగ్యులేటరీ వ్యవస్థలన్నీ ఇండస్ట్రీయల్ సేఫ్టీ పాలసీ కిందకు తీసుకు రావాలని అధికారులు తెలిపారు.

పరిశ్రమలు దాఖలు చేసే కాంప్లియన్స్ నివేదికలను ఏడాదికి రెండు సార్లు ఇచ్చేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు.వీటిపై ఎలాంటి చర్యలు తీసుకున్న అంశాన్ని ఆయా కంపెనీలు బోర్డులపై ప్రదర్శించాలని సూచించారు.

వీటిపై థర్డ్ పార్టీ తనిఖీలు ఉండాలని అధికారులు ఆదేశించారు.ఈ నిబంధనలు పరిశ్రమల్లోనే కాకుండా ఇండస్ట్రీయల్ పార్కుల్లో అమలు అవుతున్నాయా లేదా చూడాలని సీఎం జగన్ అన్నారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో కాంప్లియన్స్ నివేదిక ఇవ్వకపోతే భారీ జరిమానాలు ఉంటాయని సీఎం జగన్ గుర్తు చేశారు.ఇప్పటి నుంచి ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించాలని అన్నారు.

పారిశ్రామిక ప్రమాదాలకు బాధ్యులైన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ.50 లక్షల పరిహారం ఇచ్చేలా నిబంధనలు పొందుపర్చాల్సిందిగా అధికారులకు సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube